Pushpa USA Premiers Shows delayedభారీ అంచనాలు ఏర్పడ్డ “పుష్ప” సినిమా తొలి టాక్ యుఎస్ ప్రీమియర్స్ నుండే వెలువడనుంది. ఫస్ట్ ‘మౌత్ టాక్’ తెలుసుకోవాలనే ఉత్సాహం ట్రేడ్ వర్గాల కంటే ఎక్కువగా అభిమానుల్లో నెలకొంటుంది. దీంతో అందరి చూపులు ప్రస్తుతం “పుష్ప” ప్రీమియర్ షోల వైపే ఉంటున్నాయి. భారత కాలమానం ప్రకారం గురువారమే ఈ షోలు యుఎస్ లో ప్రదర్శితం అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి.

కానీ ఈ ప్రీమియర్ షోలకు సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటివరకు “పుష్ప” ఫైనల్ కాపీ రెడీ కాలేదని, అలాగే ఫస్ట్ హాఫ్ వరకే డిజిటల్ అప్ లోడ్ జరిగిందన్న టాక్ ట్విట్టర్ వేదికగా చర్చకు దారి తీసింది. ఇది కాస్త బన్నీ అభిమానులతో పాటు, “పుష్ప” కోసం నిరీక్షిస్తోన్న సినీ ఫ్యాన్స్ ను నిరుత్సాహ పరుస్తోంది.

దీన్ని నివృత్తి చేసేందుకు చేసిన ప్రయత్నంలో భాగంగా, యుఎస్ పంపిణీదారులు మాత్రం “అలాంటి డౌట్స్ ఏమి పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా ఇచ్చిన షెడ్యూల్స్ ప్రకారం ప్రీమియర్ షోలు పడనున్నాయని” అభయ హస్తం ఇచ్చారు. బన్నీ ఫ్యాన్స్ మాటల్లో చెప్పాలంటే… ‘యుఎస్ ప్రీమియర్స్… తగ్గేదేలే…’ అన్న డైలాగ్ కరెక్ట్ గా సరిపోతుంది.

పెద్ద సినిమాలు అందులోనూ భారీ క్రేజ్ ఏర్పడిన సినిమాల పట్ల రిలీజ్ కు ముందు ఇలాంటి పుకార్లు షికార్లు చేయడం కొత్తేమీ కాదు. గత సుకుమార్ సినిమాల ఫ్లాష్ బ్యాక్ వలన “పుష్ప”పై వస్తోన్న పుకార్లకు మరింత ప్రాధాన్యం లభిస్తోంది గానీ, ఫ్యాన్స్ ఏమి కంగారు పడాల్సిన పనే లేదు. ఫస్ట్ టాక్… యుఎస్ ప్రీమియర్స్ నుండి అనుకున్న సమయానికి వెలువడడం తధ్యం.

కానీ యుఎస్ మార్కెట్ లో “స్పైడర్ మ్యాన్” రూపంలో “పుష్ప”కు భారీ ఎదురుదెబ్బే తగలనుంది. ప్రీమియర్ షోలు అత్యధికంగా ప్రదర్శించేందుకు స్క్రీన్స్ కొరత కొట్టొచ్చినట్లు కనపడుతోంది. బహుశా ‘స్పైడర్ మ్యాన్’ సినిమా లేకుంటే ప్రస్తుతం ప్రదర్శితం అవుతోంది ‘పుష్ప’ షోల సంఖ్య ఖచ్చితంగా డబుల్ ఉండేవి. అయినప్పటికీ ఎక్కడ షో ఓపెన్ చేస్తే అక్కడ హౌస్ ఫుల్ బోర్డు పెట్టేస్తున్నారంటే ‘పుష్ప రాజ్’ క్రేజ్ ఏంటో అర్ధమవుతుంది.

“పుష్ప”కు పాజిటివ్ టాక్ వస్తే గనుక, ముందుగా నిర్ణయించుకున్న షోల సంఖ్యను మరింత పెంచేందుకు కూడా రంగం సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో అందరి చూపులు యుఎస్ ప్రీమియర్స్ పైనే ఉన్నాయి. ఫస్ట్ టాక్ వినిపించేందుకు ‘మిర్చి 9’ టీమ్ కూడా రెడీ!