సినీ ఇండస్ట్రీపై జగన్ ఎక్కుపెట్టిన బాణం ప్రభావమో లేక కాకతాళీయంగా జరిగిందో గానీ, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ వరద బాధితుల సహాయార్ధం సీఎం రిలీఫ్ ఫండ్ కు 10 లక్షల రూపాయలను ప్రకటించారు. అసెంబ్లీ జగన్ పాస్ చేసిన కొద్దీ సమయానికే ఈ ఛారిటీ ప్రకటన రావడం అత్యంత ప్రాధ్యానతను దక్కించుకుంది.

దీంతో త్వరలో రిలీజ్ కాబోతున్న అల్లు అర్జున్ “పుష్ప” సినిమా కోసమే ఈ ఫండ్ ప్రకటన అంటూ సహజంగానే నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకోసం ఇచ్చినా ఓ మంచి కార్యానికి అల్లు అరవింద్ 10 లక్షలను ప్రకటించారు కాబట్టి, ఖచ్చితంగా అభినందనీయులే!

అయితే నెటిజన్లు అనుకుంటున్నట్లు కేవలం పది లక్ష రూపాయల ఫండ్ కు జగన్ ‘కరుణామయుడు’గా మారిపోతారా? “పుష్ప”కు కావాల్సిన దారులు కల్పిస్తారా? అంటే దీనికి సమాధానం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదేమో!

ఏది ఏమైనా ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ అంతా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్ మోహన్ రెడ్డి గారిని ప్రసన్నం చేసుకునే మార్గాలను అన్వేషిస్తోంది అన్నది మాత్రం అక్షర సత్యం. ఇందులో ఎవరు ఎలా విజయం సాధిస్తారు అనేది కాలమే సమాధానం చెప్పాలి.