Pushpa - Acharyaఉన్నఫళంగా ఈ ఒక్క వారంలోనే ఇద్దరు మెగా హీరోల సినిమాల మీద కాపీ ఆరోపణలు వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య మోషన్ పోస్టర్ విడుదల కాగానే ఇద్దరు యువ రైటర్లు తమ కథను తస్కరించారంటే తమ కథ ని తస్కరించారని ఆరోపణలకు దిగారు. ఇద్దరు దానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయి అని అనడం విశేషం.

దాసరి నారాయణ రావు మరణం అనంతరం చిరంజీవి ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా మారారు. చిన్న సినిమాలను ప్రోత్సహిస్తూ… ఈ కరోనా సమయంలో ఇండస్ట్రీలోని పేదలకు సహాయం అందిస్తూ చిరంజీవి చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇటువంటి సమయంలో ఔత్సాహిక దర్శకుల పొట్టకొడుతున్నారు అనే అపప్రధ వచ్చి ఇబ్బంది పెడుతుంది.

మరోవైపు ఇప్పటిదాకా షూటింగ్ కూడా మొదలు కాని అల్లు అర్జున్ పుష్ప మీద కూడా ఇవే రకమైన ఆరోపణలు రావడం గమనార్హం. సినిమా గురించి మనకు పెద్దగా తెలియకపోయినా… ఫస్ట్ లుక్ పోస్టర్ల బట్టి… సదరు రచయిత చెబుతున్న కథలను బట్టి కొంత సారూప్యత అయితే లేకుండా లేదు. ఇది కూడా ఆందోళన కలిగించేదే.

ఇప్పుడిప్పుడే తెలుగు సినిమా ఖ్యాతి దేశమంతా విస్తరిస్తుంది. మంచి సినిమాలు.. కథలు వేరే భాషల్లో కూడా ఆదరణ పొందుతున్నాయి. ఇటువంటి తరుణంలో పెద్ద హీరోలు పెద్ద మనసుతో ఇటువంటి సమస్యలు పరిష్కారించాలి. తప్పు జరిగితే బాధితులకు న్యాయం చేసి అటు హీరోలు.. ఇటు దర్శకులు కూడా తమ పెద్దరికం నిలుపుకోవాలి.