Puri Jagannadh - Ram Pothineni -iSmart Shankar Successరామ్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్స్ పెద్దగా ఆకట్టుకోలేకపోయినా చాలా కాలం తరువాత వస్తున్న మాస్ సినిమా కావడంతో ఈ చిత్రానికి మంచి అడ్వాన్స్ బుకింగ్ ఉంది. అలాగే సినిమా టాక్ కూడా అనుకున్నదానికంటే బెటర్ గానే ఉంది. చాలా మంది యావరేజ్ సినిమా, అక్కడక్కడా పూరి మార్క్ సీన్స్ పడ్డాయి అని మాత్రమే చెబుతున్నా మాస్ సినిమాలు లేక ఆకలిగా ఉన్న ఆ సెగ్మెంట్ ఆడియన్స్ కు అది సరిపోయేలా ఉంది.

దాదాపుగా 18 కోట్ల మేర బిజినెస్ చేసిన ఈ చిత్రం అన్ని కలిసొస్తే వారాంతానికి బ్రేక్ ఈవెన్ అవుతుంది అంటున్నారు పూరి అభిమానులు. నైజాంలో మొదటి రోజే మూడు కోట్లకు తక్కువకాకుండా షేర్ రాబట్టేలా ఉందని చెబుతున్నారు. ఇదే గనుక జరిగితే రామ్ పూరి జగన్నాధ్లు ఎప్పటినుండో వేచి చుసిన పెద్ద హిట్ వచ్చేసినట్టే. బాక్స్ ఆఫీసు వద్ద సినిమాకు పెద్దగా కాంపిటీషన్ లేదు. రేపు రెండు డబ్బింగ్ సినిమాలు – కెకె, ఆమె ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

వాటి మీద ఆడియన్స్ లో పెద్దగా అంచనాలు వల్ల ఇస్మార్ట్ శంకర్ కు పెద్దగా ప్రమాదం లేదనే అంటున్నారు విశ్లేషకులు. 2012 తరువాత విడుదలైన బిజినెస్ మాన్ తరువాత పూరికి సరైన హిట్ లేదు. 2011లో వచ్చిన కందిరీగ తరువాత ఒకటి అర యావరేజ్ సినిమాలు తప్ప రామ్ కు పెద్దగా చెప్పుకోదగిన హిట్లు లేవు. ఒకవేళ ఇస్మార్ట్ శంకర్ గనుక హిట్ అయితే పూరి, రామ్ ఎప్పటినుండో వేచిన ఉదయం ఈరోజు వచ్చేసినట్టే. ఈ వారాంతం పెర్ఫార్మన్స్ బట్టి మనం ఒక అంచనాకు రావొచ్చు.