చాలా కాలం వేచి చూశాక ఇస్మార్ట్ శంకర్ తో పెద్ద హిట్ అందుకున్నాడు రామ్. ఇస్మార్ట్ శంకర్ రామ్ కెరీర్ లోనే పెద్ద హిట్ గా నిలిచింది. దాదాపుగా 35 కోట్ల షేర్ రాబట్టింది. మొట్టమొదటి సారిగా రామ్ పూర్తి స్థాయి మాస్ క్యారెక్టర్ లో నటించాడు. ఆ సినిమా విడుదలైన కొత్తలో దానికి సీక్వెల్ ప్రాజెక్టును ప్రకటించాడు పూరి జగన్నాధ్.
తమ కాంబినేషన్ లో డబల్ ఇస్మార్ట్ అనే పేరుతో ఈ సీక్వెల్ వస్తుందని ప్రకటించారు పూరి జగన్నాధ్. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్టు అనుమానంగా కనిపిస్తుంది. ఒక ఇంగ్లీష్ పేపర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ ని ఈ ప్రాజెక్టు గురించి అడిగితే ఆయన నేరుగా సమాధానం చెప్పకపోవడం గమనార్హం.
“త్వరలో నేను, పూరి జగన్నాధ్ గారు కలవబోతున్నాం. తరువాత ఏం చెయ్యాలి అనేది నిర్ణయిస్తాం. అది ఇస్మార్ట్ శంకర్ సీక్వెలా లేక మరొక ప్రాజెక్టా అనేది నిర్ణయిస్తాం. అయితే పూరితో తొందరలో మళ్ళీ పని చెయ్యడం మాత్రం ఖాయం,” అని రామ్ చెప్పుకొచ్చాడు. రామ్ ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ అనే సినిమాలో నటిస్తున్నాడు.
ఇది తమిళ సూపర్ హిట్ సినిమా, తడం రీమేక్ అని వార్తలు వస్తున్నాయి. మరోవైపు పూరి హ్యాపెనింగ్ హీరో విజయ్ దేవరకొండతో ఫైటర్ అనే సినిమాలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి నుండి ప్రారంభం అవుతుంది.
ABN RK: Will MNCs Sign MOUs With CM On Bail?
Allu Arjun Fans Behaving Like NTR Fans!