పూరి జగన్నాధ్ కు పూర్వవైభవం రావడం కష్టమేనా?

Puri-Jagannadh-Distanced-from-Themఒకప్పుడు వరస హిట్స్ తో తెలుగు తెరను ఏలిన పూరి జగన్నాథ్ ..గత కొంతకాలంగా హిట్ అనేది మర్చిపోయారు. దాంతో ఆయనతో పనిచేయటానికి పెద్ద హీరోలు ఎవరూ ఆసక్తి చూపటం లేదు. ఆయన తయారు చేసే కథల్లో గ్రిప్ ఉండటం లేదని, గతంలోలాగ ఇంట్రస్టింగ్ డైలాగులు రాయలేకపోతున్నారని చాలా మంది అభిప్రాయం. అందుకు తగ్గట్లే ఒకదాని తరువాత ఒకటి వచ్చిన ప్లాపులు పూరిలో పస అయిపోయిందని ప్రూవ్ చేసాయి. ఈ నేపధ్యంలో రామ్ తో చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా రిలీజైంది. సినిమా మంచి విజయం దిశగా ముందుకు వెళ్తుంది.

అయితే ఇప్పటికైనా పూరికి మన స్టార్ హీరోలు అవకాశం ఇస్తారా అంటే అనుమానమే. స్టార్ హీరోలు ఆయనకు డేట్స్ ఇచ్చేలా ఉంటే ఈ పాటికి ఆయనకు కంగ్రాట్స్ చెప్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేసేవారు. అంటే వాళ్లకు ఇస్మార్ట్ శంకర్ హిట్ …సరిపోవటం లేదన్నమాట. దానికి తోడు ఇస్మార్ట్ శంకర్ క్రెడిట్ మొత్తం రామ్ కే వెళ్లిపోయింది. మార్కెట్లో సరైన మాస్ సినిమా వచ్చి చాలా కాలం అవటం కూడా ఈ సినిమా కు బాగా ప్లస్ అయ్యింది. కాబట్టి ఇస్మార్ట్ శంకర్ సినిమాని స్టార్స్ పెద్ద హిట్ గా పరిగణించటం లేదు.

ఇది ఇలా ఉండగా పూరి మహేష్ బాబు కొన్ని వివాదాస్పద కామెంట్లు చేశాడు. హిట్స్ లో ఉంటే తప్ప మహేష్ బాబు తనతో సినిమా చెయ్యడని ఇస్మార్ట్ శంకర్ హిట్ అయ్యాకా అవకాశం ఇచ్చినా ఒప్పుకోవడానికి తన ఆత్మాభిమానం ఒప్పుకోదన్నట్టు పూరి చెప్పాడు. ఒక స్టార్ హీరో మీద ఇటువంటి కామెంట్స్ చెయ్యడం సాహసమే. సహజంగా మన స్టార్లు ఇలాంటి దర్శకులకు కొంత దూరంగా ఉంటారు. ఇప్పుడు ఎవరైనా పూరి కథ విని నచ్చలేదు అని అంటే మీడియా ముందుకు వెళ్లి ఏం చెప్తాడో అనే భయంతో. దాంతో ఎవరూ పూరితో చేయటానికి ఆసక్తి చూపటం లేదని సమాచారం.

Follow @mirchi9 for more User Comments
Prasad-V--PotluriDon't MissBig Producer Exposes Mahesh Babu DirectorThe giant producer Prasad V Potluri opened up his painful experiences in the industry and...Can-Saaho-Help-Avoid-A-Major--Embarrassment-For-Indian-CinemaDon't MissCan Saaho Help Avoid A Major Embarrassment For Indian Cinema?The all-important week for Telugu cinema has arrived. The wait for a couple of years...Jagan Planning Four Capitals for Andhra Pradesh?Don't MissJagan Planning Four Capitals for Andhra Pradesh?Rajya Sabha MP who switched sides from TDP to BJP, TG Venkatesh made a sensational...Samantha Akkineni to Redeem Father-In-Law Nagarjuna AkkineniDon't MissSam to Redeem Father-In-Law NagWhen his career was going strong and Nagarjuna was considered as the senior hero who...Janhvi Kapoor Not Excited To Work With Vijay Deverakonda?Don't MissJanhvi Not Excited To Work With Deverakonda?Taking her word for granted that Janhvi Kapoor has a crush on Vijay Deverakonda after...
Mirchi9