Daggubati Purandeswari's Son Hitesh Chenchuram into YSR Congress?2014 ఎన్నికల తరువాత టీడీపీతో పొత్తులో ఉండి కూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వారు పురంధేశ్వరి. తరువాతి కాలంలో ఆమె ఎందుకలా వ్యవహరించారో అర్ధం కానిది కాదు. మొత్తానికి ఏపీలో టీడీపీని గద్దె దించడంలో కీలకపాత్ర పోషించారు పురంధేశ్వరి. ఇప్పుడు ఆమెకు రెండో మిషన్ గా వైఎస్సార్ కాంగ్రెస్ ను అప్పగించినట్టున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ మతం పేరుతో సమాజాన్ని విడదీస్తోందని పురందేశ్వరి ఆరోపించారు. సహజంగా మతం అన్న టాపిక్ వస్తే బీజేపీ ఏదో ప్లాన్ మీదే ఉన్నట్టు అర్ధం.

తెలుగుదేశం పార్టీ హయాంలో కులాలు, కార్పొరేషన్ల పేరుతో విభజన రాజకీయాలు చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రికు ఏదో మెయిల్‌ వచ్చిందంటూ… విశాఖలో చర్చిలకు మాత్రమే పోలీసు భద్రత కలిపించడాన్ని ఆమె తప్పు పట్టారు. ఇలాంటి విధానాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. అలాగే తెలంగాణతో కలిసి గోదావరి జలాలను తరలించే విషయంపై అఖిలపక్షం నిర్వహించాకే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

పురంధేశ్వరి చేసే ఈ ఆరోపణలు అన్నీ బానే ఉన్నాయి. అయితే ఆమె భర్త, కొడుకు అదే పార్టీలో ఉన్నారు. మరి దానిని ఏ విధంగా సమర్ధించుకుంటారు. మతం పేరుతో సమాజాన్ని విడదీసే పార్టీలో ఉండటం ఏమిటి అని ఖండించాలి కదా? దగ్గుబాటి వెంకటేశ్వరరావు పరుచూరు నుండి పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి జరగలేదు గానీ లేకపోతే ఈ పాటికి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించే వారు. అప్పుడు కూడా పురందేశ్వరి ఇటువంటి ఆరోపణలే చేసేవారా?