Purandeswari allegations on   Polavaram Project తెలుగు దేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు బీజేపీలో ఉన్న పురంధేశ్వరి మధ్య వైరం అందరికి తెలిసిందే. చంద్రబాబు మీద లక్ష్మి పార్వతి తరువాత అంతటి పగ దగ్గుబాటి దంపతులది. భర్త రాజకీయ సన్యాసం చేసిన దానిని కొనసాగిస్తున్నారు పురంధేశ్వరి. మిత్రపక్షం నాయకురాలైన ఎప్పుడు తనదైన శైలిలో ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూనే ఉంటారు ఆమె.

తాజాగా పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వానివి తప్పుడు లెక్కలు అని ఆరోపించారు ఆమె . సరైన లెక్కలు పంపకుండా కేంద్రంపై నిందలు వేయడం సరికాదన్నారు. ప్రతిపక్షమా.. మిత్రపక్షమా.. అనేది ముఖ్యం కాదని, సరైన లెక్కలు పంపితే తక్షణమే కేంద్రం నిధులు ఇస్తుందన్నారు. కేంద్రం ఏపీకి అన్యాయం చేస్తోందనడం సరికాదన్నారు ఆమె.

ఒకవేళ ఆమె చెప్పేదే నిజం అనుకుందాం కాసేపు. రాష్ట్ర ప్రభుత్వానివి తప్పుడు లెక్కలు అని ఏనాడైనా ఇదివరకు జలవనరులు శాఖ మంత్రిగా ఉన్న ఉమాభారతి గానీ ఇప్పటి నితిన్ గడ్కరీ గానీ చెప్పిన సందర్భం ఉందా? ఆమె చెప్పేది నిజమైతే సొంత పార్టీ వారితో దానిగురించి ఎందుకు చెప్పించలేకపోతున్నారు ఆమె? ఒకరకంగా చంద్రబాబు కేంద్రం సహకరించడం లేదని అసెంబ్లీలోనే చెప్పకనే చెప్పారు చంద్రబాబు.

అప్పుడైనా లేదు మాపై బురద జల్లుతున్నారు, రాష్ట్ర ప్రభుత్వానివి తప్పుడు లెక్కలు అని ఢిల్లీ వారు ఎందుకు చెప్పలేదు? పురందేశ్వరి ఎందుకు చెప్పించలేకపోయారు? వీటికి సమాధానం చెప్పనంతవరకు ఆమె చేసే విమర్శలకు పసలేదని అనుకుంటారు కదా ప్రజలు? రాజకీయాల్లో ఎంతో అనుభవమున్న ఆమెకు తెలియనిదా ఇది? కుటుంబ తగాదాలకు రాజకీయాలని వాడుకుంటుంది అనే అపప్రధ రాదా?