Puneeth Rajkumar met with car accident-కన్నడ అభిమానులు ముద్దుగా పిలుచుకునే పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గురువారం నాడు సాయంత్రం ఓ ప్రమాదం నుండి బయటపడ్డారు. “నటసార్వభౌమ” సినిమా షూటింగ్ ముగించుకుని బళ్ళారి నుండి బెంగుళూరుకు బయలుదేరిన పవర్ స్టార్ కారు ప్రమాదానికి గురయ్యింది. అనంతపురం వద్ద టైరు పంక్చర్ కావడంతో, కారు అదుపుతప్పింది.

అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయంలో అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, పునీత్ సురక్షితంగా ఉన్నారని అధికారిక సమాచారం వెలువడింది. యాక్సిడెంట్ కు గురైన సదరు కారు (రేంజ్ రోవర్) ఫోటోలు మాత్రం నెట్టింట సందడి చేస్తున్నాయి. ఎంత ఖరీదైన కార్లైనా గానీ పంక్చర్లు పడకుండా ఉంటాయా?!