Public-of-Tirupati-for-3-Capitals supportఒకే రాష్ట్రం – ఒకే రాజధాని – ఒకే అమరావతి అన్న నినాదంతో రైతులు సంకల్పించిన పాదయాత్ర విజయవంతం కావడం, అలాగే శుక్రవారం నాడు జరిగిన బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో, 3 రాజధానుల ఉద్యమం అంటూ ఓ సరికొత్త అంశం తెరపైకి వచ్చింది.

తొలుత తిరుపతిలో ఓ మినీ పాదయాత్ర చేయగా, అందులో పాల్గొన్న మహిళలు, విద్యార్థులు ‘జై అమరావతి’ నినాదాలతో హోరెత్తించడంతో 3 రాజధానుల అంశాన్ని భుజాన వేసుకున్న వైసీపీ వర్గమంతా నాలుక కరచుకున్నారు. అలాగే తమను బలవంతంగా తీసుకువచ్చారని మరికొందరు మీడియా వేదికగా వెల్లడించారు.

తాజాగా 3 రాజధానుల పేరుతో అమరావతి బహిరంగ సభ లాంటి దానిని నిర్వహించాలని తలపెట్టగా, ఈ సభకు జనాలను సేకరించే కార్యక్రమాన్ని ప్రభుత్వ అధికారులు, సచివాలయ అధికారులు తీసుకున్నట్లు కనపడుతోంది. దీనికి సంబంధించిన ఓ కధనాన్ని ప్రముఖ ఏబీఎన్ ఛానల్ ప్రసారం చేసింది.

డ్వాక్రా సభ అని చెప్పి తమను బలవంతంగా ఈ సభకు రప్పించారని కొందరు మహిళలు చెప్తుంటే, రాకపోతే 1000 రూపాయలు జరిమానా విధిస్తామని మెప్మా అధికారులు చెప్పడంతో తప్పక వచ్చామని మరికొందరు మహిళలు వాపోతున్నారు. దీనికి సంబంధించిన కధనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఒకప్పుడు సభలకు డబ్బులు, బిర్యానీ ప్యాకెట్ లు ఇచ్చి జనాలను తరలించేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పద్ధతి కాస్త మారినట్లుంది. అన్ని పధకాలు సచివాలయ అధికారుల చేతుల్లో ఉండడంతో, ప్రస్తుతం బెదిరించి జనాలను తరలించే స్థాయికి నేతలు ఎదిగినట్లున్నారు.