PSPK25 Shooting in Varanasiపవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ఇటీవలే యూరప్ లో ఒక ఇంపార్టెంట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ నేటి నుండి కాశీలో మొదలు అవుతుంది. అక్కడ పవన్ కళ్యాణ్ పై ఆ సినిమా యొక్క టైటిల్ సాంగ్ చిత్రీకరించబోతున్నారు. అజ్ఞాతవాసి అనే టైటిల్ దాదాపుగా కంఫర్మ్ అని తెలుస్తుంది.

ఈ పాట షూటింగ్ తరువాత హైదరాబాద్ లో చివరి షెడ్యూల్ జరుగుతుంది. దీనితో ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తి అవుతుంది. డిసెంబర్ నెల మధ్య నాటికి మొత్తం షూటింగ్ పూర్తి చేసి నిర్మాణానంతర పనులు మొదలు పెట్టాలని యూనిట్ ప్లాన్. జనవరి 10, 2018 రోజున సంక్రాంతి సందర్భంగా సినిమా విడుదల అవ్వబోతుంది.

ఈ సినిమా షూటింగ్ తరువాత పవన్ కళ్యాణ్ పూర్తి సమయం తన జనసేన పార్టీ కార్యకలాపాలకే వినియోగించనున్నారు. 2019 ఎన్నికల కోసం సమాయత్తం అవుతారు. పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సోమరుగా 130 కోట్ల బిజినెస్ నడుస్తుంది.