“30 ఇయర్స్ ఇండస్ట్రీ” అంటూ ఒక్క డైలాగ్ తో తన ఫేట్ మార్చుకున్న పృథ్వీరాజ్ కు తత్వం భోదపడినట్లు ఉంది అంటున్నారు అటు సినీ ఇండస్ట్రీ, ఇటు రాజకీయ నాయకులు. సినిమాలలో కమీడియన్ గా ఒక వెలుగు వెలిగిపోతున్న సమయంలో రాజకీయాలంటూ వచ్చి ‘ఫ్యాన్’ దెబ్బకు షాక్ తిన్నారు పృధ్వి.
2019 ఎన్నికల ముందు వైసీపీ పార్టీకి మద్దతు పలికి, జగన్ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుందని జగన్ కీర్తనలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ ను విమర్శించడానికి అదే రంగంలో తనకు మద్దతు పలికిన నటులను జగన్ ఉపయోగించుకున్నారు. అందులో తన వంతుగా పృధ్వీ పాలు పంచుకున్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక కానీ వీరికి తత్త్వం బోధపడలేదంటున్నారు పవన్ అభిమానులు.
టీటీడీ వంటి పుణ్యక్షేత్రానికి సంబంధించిన ఛానెల్ లో పదవి ఇచ్చినట్టే ఇచ్చి తనపై తప్పుడు ప్రచారాలు చేసారంటూ, ఇదంతా తానూ సొంతవారీగా భావించిన వారే చేసారంటూ పృధ్వీ నిరాశ – నిస్పృహలకు లోనయ్యారు. ఒకప్పుడు మేము జగన్ గారి భక్తులం అని చెప్పిన పృధ్వీ తాజాగా మాట మార్చారు.
“ఏరు దాటక ముందు ఎరుమల్లన్న – ఏరు దాటాక బోడిమల్లన్న” అనే సామెత తన జీవితంలో జరిగిందంటూ పృధ్వీ ఆవేదన వ్యక్తం చేశారు. నా వెనుకేదో కొండ ఉందని భావించి మోసపోయానని., తనకు రాజకీయాలు సెట్ కావని., ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ కు నా క్షమాపణలు అంటూ., నా అంతటా నేనే ఆరోపణలు చేసేసి.,తప్పుగా మాట్లాడడం జరిగిందని., ఇప్పుడు తనకు అన్ని అర్ధమవుతున్నాయని తెలిపారు.
మరి 30 ఇయర్స్ ఇండస్ట్రీకి ఏమర్దమయ్యిందో కూడా చెపితే బాగుంటుందంటున్నారు ఏపీ ప్రజలు. పృథ్వీకి “క్షవరం అయ్యాక వివరం వచ్చినట్లుగా” ఉంది అంటున్నారు సినీ ప్రేక్షకులు. ఇక తన జీవితం సినిమా
ఇండస్ట్రీలోనే అంటూ పరోక్షంగా సినీ నిర్మాతలకు హింట్ ఇచ్చారు., చూడాలి మరి సినీ ఇండస్ట్రీ ఈ 30 ఇయర్స్ పృధ్వీకి మరో ఛాన్స్ ఇచ్చి చూస్తుందో లేదో!?
Chay’s Dialogue Targeted at His Ex-wife?
Senior Actor Vexed With Pawan Kalyan!