Rio Olympics, Rio Olympics Prostitution Discount, Rio Olympics Prostitutes Offer Discount Coupons, Rio Olympics Prostitutes Discount Promos ఒలింపిక్స్ జరుగుతున్నాయంటే సంతోషించే వారిలో ముందు వరుసలో ఉండేవారు సెక్స్ వర్కర్లు అనడంలో ఎలాంటి అతిశయోక్తి కాదు. రికార్డులు చెబుతున్న గణాంకాల ప్రకారం ఒలింపిక్స్ సందర్భంగా జోరందుకునే వ్యాపారాల్లో ఇది కూడా ఒకటని గత చరిత్ర చెప్తోంది. తాజాగా జరుగుతున్న రియో ఒలింపిక్స్ లో దోపిడీ దొంగలు పెరిపోయారు. నడి రోడ్లపై పట్టపగలు టూరిస్టులను దోచేస్తున్నారు. దీంతో ఆటగాళ్లు, టూరిస్టులు రియోలోని కొన్ని ప్రాంతాలకు వెళ్లడం మానేశారు. ప్రధానంగా మకరానా స్టేడియంకు 1.7 కిలోమీటర్ల దూరంలో ఉన్న రియో అతి పెద్ద రెడ్ లైట్ ఏరియా విలా మిమోసావైపు వెళ్లేందుకు ఎవరూ సాహసించడం లేదు.

దీంతో సెక్స్ వర్కర్ల ఆదాయం పడిపోయింది. ఆదాయం పడిపోవడంతో 12 వేల మంది సెక్స్ వర్కర్లు 50 శాతం డిస్కౌంట్ ప్రకటించారు. దీంతో ఈ రెడ్ లైట్ ఏరియాలో ధరలు 1500 రూపాయల నుంచి 850 రూపాయలకు పడిపోయాయని తెలుస్తోంది. విదేశీయులకు అర్ధమయ్యేందుకు సెక్స్ వర్కర్లు ఇంగ్లిష్, పోర్చుగీస్, ఇతర భాషల్లో డిస్కౌంట్లు తెలియజేస్తూ బోర్డులు కూడా పెట్టడం విశేషం. కాగా, బ్రెజిల్ లో గత 18 ఏళ్లుగా వ్యభిచారం చట్టబద్దంగా నడుస్తోంది. అయితే ఇక్కడ వ్యభిచారం చేయడం నేరం కాదు కానీ, వేశ్యాగృహాలు నిర్వహించడం నేరం.