Chiranjeevi's-'Gundu'-Look---What-is--the-Messageనిన్న మెగాస్టార్ చిరంజీవి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన క్లీన్-షేవెన్ లుక్ చిత్రాన్ని పోస్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తన ప్రస్తుత ప్రాజెక్ట్ ఆచార్య కోసం కొంత మేక్ఓవర్ కోసం ప్రయత్నిస్తున్నారా అంటూ ఈ ఇమేజ్ ఊహాగానాలకు దారితీసింది. అసలు ఏమి జరిగిందో తెలుసుకోవాలంటే ఇది చదవండి.

అది నిజం లుక్ కాదని, గుండు లుక్‌లో కనిపించడానికి నటుడికి ప్రొస్థెటిక్ మేకప్ వేయించుకున్నారని సమాచారం. బిగ్ బాస్ తెలుగు 4 ప్రోమో కోసం ముసలి గెటప్‌లో నాగార్జునను చూపించడానికి మేకప్ బృందం ఒకటి ముంబై నుంచి దిగింది. ముసలి గెటప్‌లో నాగార్జునను చూపించడానికి, ఆయనకు విగ్ ధరింపచెయ్యాలి.

దీనికి ముందు నటుడి జుట్టును “గుండు” చేయాలి. అది కుదరదు కాబట్టి వారు ప్రొస్తెటిక్ మేకప్‌ను ఎంచుకున్నారు, తద్వారా విగ్ ఉంచడానికి క్లీన్-షేవ్ సాధించారు. ఆ విషయం తెలుసుకున్న చిరంజీవి కూడా ఆ రూపంలో నాగార్జునను చూసి ముగ్ధుడయ్యాడట. అలాగే అటువంటి లుక్ కావాలని ముచ్చట పడ్డారట.

దానితో, నాగార్జున అదే బృందాన్ని చిరంజీవి వద్దకు పంపాడు. నిన్న మనం చూసిన చిరంజీవి గుండు లుక్ ప్రోస్తెటిక్ మేకప్ తప్ప మరొకటి కాదు అని అంటున్నారు. కొన్ని గంటలు మాత్రం చిరంజీవి ఆ లుక్ లో ఉన్నారట. తరువాత అదే టీం ఆ మేక్ అప్ తీసేసిందిని సమాచారం.