Producer suresh babu clarifies on shootingsయంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ రాధే శ్యామ్ మినహా, ప్రముఖ చిత్ర బృందం ఏదీ తమ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించే ప్రణాళికను అధికారికంగా ప్రకటించలేదు. అయితే, కరోనా పరిస్థితులను ఎదిరించి షూట్ చెయ్యడానికి వివిధ సినీ బృందాలు సిద్ధం అవుతున్నాయని మనంఈ మధ్య కాలంలో వార్తలు వింటూనే ఉన్నాం.

అయితే, మనకు ఉన్న సమాచారం ప్రకారం.. “ఎవరైనా తిరిగి పనిలోకి రావచ్చు, అయితే దగ్గుబాటి హీరోస్ మాత్రం వ్యాక్సిన్ వచ్చే వరకూ వెంకటేష్ మరియు రానా పనిచేయడం ప్రారంభించరు. సురేష్ దాని గురించి చాలా పార్టిక్యూలర్ గా ఉన్నారు. ఈ ఆలస్యం వల్ల ఆర్ధికంగా నష్టపోవాల్సి వచ్చినా తనకు ఇబ్బంది లేదని సురేష్ ఇప్పటికే ఆయా సినిమా బృందాలకు స్పష్టం చేశారట”.

ఇది ఇలా ఉండగా… తన నియంత్రణలో ఉన్న థియేటర్లు భారత ప్రభుత్వం అనుమతించినా త్వరగా తెరవవని సురేష్ బాబు ఇప్పటికే ధృవీకరించారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో సురేష్ బాబు నియంత్రణలో ఉన్న 450 థియేటర్లు ఉన్నాయి. దీనితో సురేష్ బాబు కరోనా విషయంలో ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నారో మనకు అర్ధం అవుతుంది.

వెంకటేష్ మరో నెల షూటింగ్ పూర్తి చేస్తే ఆయన తదుపరి చిత్రం నారప్ప షూటింగ్ పూర్తి అవుతుంది. ఇక రానా నటించిన అరణ్య సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అలాగే అతను నటిస్తున్న మరో సినిమా… విరాటపర్వం కేవలం ఐదు రోజుల షూటింగ్ చేస్తే పూర్తి అవుతుంది. అయితే ఈ మూడు సినిమాలు థియేటర్లలోనే విడుదల చేసే ఉద్దేశం ఉండటంతో వారికి కంగారేమి లేదట.