PVP---They-Said-Big-Producer-Blackmailed-Heroinesసినీ నిర్మాత, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు పొట్లూరి వరప్రసాద్ చిక్కుల్లో పడ్డారు. ఒక భూవివాదంలో ఆయనను బంజారాహిల్స్ పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికే పీవీపీపై బంజారాహిల్స్ పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను స్టేషన్‌కు పిలిపించి పోలీసులు విచారిస్తున్నారు.

భూవివాదం నేపథ్యంలో తన ఇంటి పక్కన నిర్మాణం అవుతున్న కైలాష్ విక్రమ్ ఇంట్లోకి బౌన్సర్లను తీసుకెళ్లి పీవీపీ దాడికి దిగారని ఫిర్యాదుదారుడు పోలీసులకు కంప్లైంట్ చేశారు. కైలాష్ విక్రమ్ ఫిర్యాదు మేరకు పీవీపీని పోలీసు స్టేషన్ లో విచారించి ఆయా తరువాత . ఆయనను మరోసారి కైలాష్ విక్రమ్ ఇంటికి తెలుకెళ్లి విచారిస్తున్నారు.

అయితే ఈ కేసులో పీవీపీని రిమాండ్‌కు తరలిస్తారా? లేదా స్టేషన్ బెయిల్ ఇస్తారా? అనేది మరికొద్దిసేపట్లో తేలనుంది. పీవీపీ గత ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరి, విజయవాడ ఎంపీగా పోటీ చేశారు. అయితే టీడీపీ అభ్యర్థి కేశినేని నాని చేతిలో ఓడిపోయారు. ఆ తరువాత నుండీ ఆయన ట్విట్టర్ లో ఎక్కువగా రాజకీయ విమర్శలు చేస్తూనే ఉంటారు.

ఇటీవలే కాలంలో ఆయన నిర్మాత బండ్ల గణేష్ మీద ఒక్క అప్పు ఎగవేత కేసు పెట్టి జైలు కు పంపించారు. ఇప్పుడు తానే స్వయంగా కేసులో ఇరుక్కోవడం గమనార్హం. అయితే ఈ పరిణామం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందే అని చెప్పుకోవాలి. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే పీవీపీ కొన్ని జగన్ అవినీతి కేసులలో నిందితుడు కూడా.