Dil Raju Love Storyఅనుకుంటాం కానీ సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లోనూ తారలు దర్శకులకు సంబంధించిన ఇంటరెస్టింగ్ లవ్ స్టోరీస్ ఉంటాయి. అవి వాళ్ళుగా చెబితేనే బయటికి వస్తాయి తప్పించి పరిచయం ఎక్కడ మొదలై పెళ్లి దాకా వెళ్లిందనే సంగతి బయట ప్రపంచానికి తెలియదు. దిల్ రాజు సైతం ఈ బ్యాచ్ లోకి చేరిన సంగతి తెలిసిందే. అయిదు దశాబ్దాల వయసుకి దగ్గర ఉన్నప్పుడు రెండో పెళ్లికి సిద్ధపడటం అనేది నిజ జీవితంలో ఎందరో ఉన్నప్పటికి అవి అంతగా వార్తల్లోకి రావు. మా నాన్నకు పెళ్లిలో కృష్ణంరాజుకి శ్రీకాంత్ దగ్గరుండి మరీ అంబికతో మ్యారేజ్ చేయించడం అప్పట్లో హిట్ కాన్సెప్ట్.

సరే ఇక విషయానికి వస్తే దిల్ రాజు ప్రేమకథ ఏంటో స్వయంగా ఆయన భార్య వైఘా రెడ్డినే ఒక న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పేశారు. ఆవిడ అసలు పేరు తేజస్విని. ఎంఎస్సి బయో కెమిస్ట్రీ చేశాక పిహెచ్డి చేయడం కోసం విదేశాలకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. ఎయిర్ హోస్టెస్ గా ఉద్యోగం చేస్తున్నది కూడా ఆ సమయంలోనే. తరచుగా ఆ ఎయిర్ లైన్స్ లో ప్రయాణం చేస్తున్న రాజుగారు మొదటిసారి వైఘాతో అన్న మాట పెన్ను ఇస్తారా. అక్కడి నుంచి మాటా మాటా కలిసింది. భార్యను కోల్పోయి ఏదో వెలితిని అనుభవిస్తున్న ఆయనకు జీవిత భాగస్వామి గురించి పెద్దగా ఆలోచన లేదు.

సరే పలువురు శ్రేయోభిలాషులు చెప్పిన మీదట రెండో వివాహం గురించి పునఃనిర్ణయం. వైఘా రెడ్డి దగ్గర ఫోన్ నెంబర్ తీసుకోవడం, కాల్స్ చేసుకోవడం అలవాటయ్యాక ఆవిడ డౌన్ టు ఎర్త్ మనస్తత్వం అర్థమయ్యింది. దిల్ రాజు అయితే ఏంటి అనే అనే తీరు నచ్చింది. మొదటి వైఘా రెడ్డి కాబోయే భర్తను డైరెక్టర్ అనుకుందట. ప్రపోజ్ చేసుకుని అంగీకారం చెప్పుకున్నాక అప్పుడు గూగుల్ చేసి చూస్తే ఎస్వివి బ్యానర్, అందులో వచ్చిన బ్లాక్ బస్టర్లు, దిల్ రాజు రేంజ్ గురించి క్లారిటీ వచ్చింది. ఏడాదికోసారి దసరాకు మాత్రమే సినిమాలు చూసే వైఘాకు అంతకన్నా ఎలా తెలుస్తుంది.

అలా ఈ లవ్ స్టోరీ పెళ్ళిపీటల దాకా వెళ్ళింది. పర్సనల్ లైఫ్ కు ఇండస్ట్రీకి బ్యాలన్స్ చేస్తారని దిల్ రాజు గురించి చాలా విషయాలే పంచుకున్నారు వైఘా రెడ్డి. సో ఒక పెన్ను వీళ్ళను ఒక్కటి చేసేందుకు పూనుకుందన్న మాట. థియేటర్ వారసుడు షూటింగ్ పూర్తవుతున్న సమయంలోనే దిల్ రాజు దంపతులకు నిజమైన వారసుడు కలిగిన సంగతి తెలిసిందే. మగ సంతానం లేదనే లోటు కూడా దీంతో తీరిపోయింది. తెలుగు సంగతి ఎలా ఉన్నా వరిసు తమిళంలో పెద్ద హిట్టే కొట్టేలా ఉంది. కథాకథనాలు మనకెలా అనిపించినా అరవ అభిమానులు కనెక్ట్ అయ్యారని వసూళ్లు చెబుతున్నాయి.