C Kalyan YS Jaganనిర్మాత సి కళ్యాణ్ ఏపి రాజకీయాలకు సినిమా రంగానికి ముడిపడిన అంశాల మీద మాట్లాడారు. కొంత కాలం క్రితం పరిశ్రమ సమస్యల గురించి విన్నవించుకోవడానికి ఇండస్ట్రీ ప్రతినిథులు జగన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అయన అందరినీ తదేకంగా చూసి మీరు మా పార్టీ కాదు కదాని నేరుగా ప్రశ్నించారని అప్పుడు అందరిలో నేను మాత్రమే కాదని ఒప్పుకుని వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాటి అనుకూల పరిస్థితులను జగన్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశానని చెప్పారు.

“నేను వైఎస్ కి చాలా క్లోజ్. అప్పట్లో మేము పరిశ్రమకు ఏమైనా సమస్య వస్తే వైఎస్ గారి దగ్గరకు వెళ్లి చెప్పుకునే వాళ్ళం. ఆయన వెంటనే చేసి పెట్టేవాళ్ళు. ప్రస్తుతం అప్పొయింట్ మెంట్ దొరకడమే కష్టంగా మారింది. ఆయన ఏవో చేస్తాం అన్నారు. కానీ దానిని ఫాలో అప్ చేసే వాళ్ళు కూడా లేరు,” చెప్పుకొచ్చారు

హీరోలు దర్శకులు నిర్మాతలు ఎవరు జగన్ ని కలిసినా అందులో అత్యధిక శాతం కేవలం తమ ప్రయోజనాలైన టికెట్ రేట్ల పెంపు, థియేటర్ల అనుమతుల గురించి తప్ప నిజంగా ఇండస్ట్రీలో ఉన్న సమస్యల గురించి, దీని మీద ఆధారపడిన వేలాది కార్మికుల గురించి కాదని తేల్చి చెప్పారు. తాను ఎంతగా ప్రయత్నించినా ఫాలోఅప్ జరగలేదని ఎవరికి వారు తమ సినిమాలకు సంబంధించిన సమస్యల మీదే చర్చలకు రావడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందాన దేనికీ పరిష్కారం దొరకలేదని వివరించారు

అందుకే గతానికి వర్తమానానికి ఎలాంటి తేడా లేకుండా పోయిందన్న కళ్యాణ్ డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలు, డబ్బింగ్ సినిమాల విషయంలో ప్రస్తుతం నలుగుతూన్న వివాదం గురించి ప్రస్తుత పోకడ మీదా చురకలు వేశారు. దిల్ రాజుతో పేచీ రాకపోతే మైత్రి వాళ్ళు స్వంత ఆఫీస్ ఎందుకు పెట్టుకుంటారని ప్రశ్నించిన కళ్యాణ్ ఇప్పుడు వెలిగిన స్టార్లు ప్రొడ్యూసర్లు డైరెక్టర్ తర్వాత పడతారని అప్పుడు ఏం మంచి చేశామనేది గుర్తుపెట్టుకునేలా చేస్తుందని చెప్పారు. శంకర్ మణిరత్నం లాంటోళ్లను ప్రశాంత్ నీల్ లాంటి యంగ్ డైరెక్టర్లు టేకోవర్ చేయడం ఉదాహరణగా చెప్పారు