priyanka-chopraప్రియాంకా చోప్రాకు చెందిన పర్పుల్ పెబుల్ పిక్చర్స్(పీపీపీ)కు చిక్కులు ఎదురయ్యాయి. ఈ సంస్థ “నళిని” అనే పేరుతో సినిమా నిర్మాణాన్ని తలపెట్టింది. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ టీనేజ్ లో ఉన్నప్పుడు, ఓ మరాఠీ యువతితో ఉన్న సంబంధం నేపథ్యంలో ఈ సినిమా నిర్మాణం జరుగుతోంది. ఈ సినిమా షూటింగును పశ్చిమబెంగాల్లోని విశ్వభారతి యూనివర్సిటీలో నిర్వహించాలనుకున్నారు. అయితే విశ్వవిద్యాలయ ప్రాంగణంలో సినిమా నిర్మాణానికి అనుమతి లభించలేదు.

కథ గురించి అధికారులు, ఆశ్రమవాసులతో, ఠాగూర్ గురించి బాగా తెలిసిన నిపుణులతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయానికి రావడం జరిగింది. అటువంటి సినిమాల చిత్రీకరణ క్యాంపస్ లో నిర్వహించేందుకు అనుమితించేది లేదు. లక్షలాది మంది మనోభావాలను గాయపరుస్తుందని యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ సబుజ్ కోలిసేన్ తెలిపారు. ఇది విద్యాసంస్థ అని, వాణిజ్య సినిమాల చిత్రీకరణకు అనుమతించి వాతావరణాన్ని పాడు చేయదలుచుకోలేదని సేన్ చెప్పారు. ఇదే నిర్ణయాన్ని నళిని సినిమా దర్శకుడు ఉజ్జల్ ఛటర్జీకి వర్సిటీ అధికారులు తెలియజేయగా, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని ఛటర్జీ అన్నారు.