Priyanka Chopra goodbye to Quanticoతనకు అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చి పెట్టడంతో పాటు హాలీవుడ్ ఛాన్స్ లనూ దగ్గర చేసిన ‘క్వాంటికో’ సిరీస్ కు బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా గుడ్ బై చెప్పింది. ఈ సిరీస్ లో అలెక్స్ పారిష్ పాత్రలో నటించి, మెప్పించిన ప్రియాంకకు పీపుల్స్ చాయిస్ అవార్డు కూడా లభించిన సంగతి తెలిసిందే. క్వాంటికో సిరీస్ పూర్తి అయిందని భావోద్వేగంతో తాను అలెక్స్ పారిష్ పాత్రకు గుడ్ బై చెబుతున్నానని ప్రియాంక తాజాగా వ్యాఖ్యానించింది.

ఈ పాత్ర మానసికంగా, శారీరకంగా సవాలుతో కూడినదని, తనకు ఎంతో గొప్ప గుర్తింపును తెచ్చిందని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. తన కోసం ప్రతి వారం టీవీలను చూసిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పిన ప్రియాంక, క్వాంటికో బృందానికి కూడా ధన్యవాదాలు చెప్పింది. ఈ టీమ్ తో కలసి పనిచేయడం చాలా సంతోషాన్ని కలిగించిందని చెబుతూ ట్వీట్ చేసిన ప్రియాంక, చిత్ర బృందంతో కలిసి దిగిన ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది.