Priyanka-Chopra-gownసోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరి అభిప్రాయాలు వారు తెలియజేయడానికి ఒక స్వేఛ్చ లభించడంతో… తమ తమ విజ్ఞానాన్ని ప్రదర్శించడం ఎక్కువైపోయింది. ఒక్కోసారి ఇది మరీ పరిధి దాటుతున్నట్లుగా కనపడుతున్నా… ఒక్కోసారి మాత్రం చలోక్తులతో, పంచ్ లతో వినోద కార్యక్రమంగా మారిపోతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాకు ఆహారంలా లభించింది ప్రియాంకా చోప్రా కాస్ట్యూమ్.

న్యూయార్క్ లో జరిగిన ‘మెట్ గాలా ఫ్యాషన్ ఈవెంట్’లో పాల్గొన్న ప్రియాంక చోప్రా బ్రౌన్ కలర్ ట్రెంచ్ కోట్ వేసుకుని సందడి చేసింది. అయితే ప్రియాంక నడిచి వస్తుంటే… వెనుక ఓ బ్రౌన్ కార్పెట్ కూడా ఆమెతో పాటు కదిలి వస్తున్నట్లుగా ఉంది. ఇంకేముంది… కట్ చేస్తే… సోషల్ మీడియా అంతా ఈ డ్రెస్ తో కూడిన ఫోటోలతో నిండిపోయాయి. బహుశా ప్రియాంక ఇంత హంగామా జరుగుతుందని భావిస్తే… ప్రియాంక ఈ కాస్ట్యూమ్ ను ధరించేదో లేదో అన్నది చిన్న అనుమానమే!

వీక్షించడానికి వినోదంగా మారిన ప్రియాంక కాస్ట్యూమ్స్ పై ‘దంగల్’ సినిమాలో అమీర్ ఖాన్ టీం కుస్తీ పోటీలు ఆడుతున్నారు, అలాగే కేజ్రీవాల్ యోగా ప్రాక్టీస్ చేస్తున్నారు, కుటుంబ సభ్యులు విందు, వినోద కార్యక్రమాలలో భాగంగా సేద తీరుతున్నారు, సల్మాన్ ఖాన్ అయితే ఏకంగా ఓ రోడ్డు రోలర్ నే లాగేస్తున్నారు. ఇలా ఒకటేముందిలే… ఎవరి క్రియేటివిటీకి తగ్గట్లుగా వారు ఈ ఫోటోలను వాడుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తూ బీభత్సమైన సందడి చేస్తున్నారు.