Priya Prakash Varrier to romance Nithiin Reddy‘వింక్’ వీడియోతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రియా ప్రకాష్ వారియర్ అప్పట్లో తెలుగులో చాలా అవకాశాలు అందుకుంది. తెలుగు దర్శక నిర్మాతలు ఆమెకు పెద్ద రెమ్యునరేషన్ ఆఫర్ చేశారు అయితే ఆమె సంతృప్తి చెందకుండా అప్పట్లో మంచి క్రేజ్ ఉన్నందువలన ఇంకా ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేసింది వారియర్. దీంతో నిర్మాతలు ఆమెకు టాటా చెప్పారు. దాదాపు వస్తాయన్న అన్ని అవకాశాలు ఆమె నుండి దూరంగా వెళ్లిపోయాయి. అప్పుడు విడుదలైన ఆమె మొదటి సినిమా లవర్స్ డే బాక్స్ ఆఫీసు వద్ద బోల్తా పడింది.

ఇక ఆమెకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ కష్టం అనుకున్నారు అందరూ. కానీ అనూహ్యంగా నితిన్ కొత్త సినిమాలో ఆమెకు ఛాన్స్ దక్కింది. నితిన్ హీరోగా చంద్రశేఖర్ ఏలేటి ఒక సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. ఇందులో ఒక హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కాగా ఇంకో హీరోయిన్ ప్రియా ప్రకాష్. ఈ సినిమా ముహూర్తం ఈరోజు జరిగింది. లాంచ్ కి ఆమె కూడా వచ్చింది. మరి ఆలస్యమైనా మంచి సినిమానే పట్టిన ఆమె ఇక్కడ సెటిల్ అవుతుందేమో చూడాలి. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు

ఈ చిత్రం త్వరలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. ప్రస్తుతం నితిన్ ‘భీష్మ’ సినిమాతో బిజీగా ఉన్నారు. రష్మికా మందన కథానాయికగా నటిస్తున్నారు. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీనివాస కళ్యాణం ప్లాపైన తరువాత దాదాపుగా ఏడాది పాటు ఖాళీగా ఉన్న నితిన్ వరుసగా రెండు సినిమాలు మొదలు పెట్టారు. మరో సినిమా కూడా తొందరలో ముహూర్తం జరుపుకోబోతుందని సమాచారం. మరి ఈ మూడు సినిమాలు ఎప్పుడు విడుదల అవుతున్నాయి.