PRIYA-PRAKASH-VARRIER-new-chocolate-Ad‘ఒరు అదార్ లవ్’ సినిమా పాటలో ఒకే ఒక్క సీన్ తో యావత్తు ఇండియాను ఊపేసిన ప్రియ ప్రకాష్ వారియర్, ప్రస్తుతం పెద్ద సెలబ్రిటీగా మారిపోయింది. దీంతో యధావిధిగా బ్రాండ్ ప్రమోషన్లు ప్రియా ఇంట ముంగిట వాలాయి. అందులో మొదటగా ‘మంచ్’ చాక్లెట్ యాడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఆ పాటలో ఎలా అయితే కన్ను కొట్టి ప్రేక్షక దేవుళ్ళను పడేసిందో, ఈ యాడ్ లోనూ అదే విధంగా కన్ను కొట్టి ఆటగాడిని ‘చాక్లెట్’తో పడేసింది. సదరు కంపెనీకి సంబంధించిన యాడ్ కంటే కూడా ‘ప్రియా ప్రకాష్ వారియర్ యాడ్’ అంటూ యూ ట్యూబ్ లో సందడి చేయడం, ఈ ముద్దుగుమ్మకున్న క్రేజ్ ను చాటిచెప్తుంది.