Priya Prakash Varrierగత ఏడాది ప్రియా ప్రకాష్ వారియ‌ర్ సృష్టించిన క‌ల‌క‌లం అంతా ఇంతా కాదు. ఆమె హైద‌రాబాద్‌కి వ‌చ్చిన‌పుడు హీరోలంతా ఆమెతో న‌టించేందుకు ఎగ‌బడ్డారు. ఆమె న‌టించిన ల‌వ‌ర్స్ డే సినిమా ఈవెంట్‌కి అల్లు అర్జున్ గెస్ట్‌గా వ‌చ్చాడు. అప్పట్లో బ‌న్ని ఆమెకి త‌న కొత్త సినిమాలో ఆఫ‌ర్ ఇచ్చాడ‌ని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. కోటి రూపాయ‌ల పారితోషికం కూడా ఇస్తామ‌ని ప్రొడ్యూసర్లు ఎగబడ్డారు. అయితే ఆశ చావక లవర్స్ డే రిలీజ్ అయ్యాక ఇంకా ఎక్కువ మొత్తం ముడుతుందని ఆమె ఏ సినిమా సైన్ చెయ్యలేదు.

నితిన్ – చంద్రశేఖర్ యేలేటి సినిమా కోసం ఆమెకు కోటి రూపాయిల పారితోషికం ఇవ్వజూపి పాతిక లక్షల అడ్వాన్స్ ఇవ్వబోయారు వెనిగళ్ల ఆనంద్ ప్రసాద్. అయితే లవర్స్ డే విడుదల వరకూ తాను సినిమాలు సైన్ చెయ్యనని ఆమె తెగేసి చెప్పింది. ల‌వ‌ర్స్ డే దారుణంగా ప‌రాజ‌యం పాలైంది. ఆ సినిమా చూసిన వారికి అర్థ‌మైంది ఏంటంటే ఆమెకి న‌యాపైసా యాక్టింగ్ రాద‌ని. దీనితో ఆమె వైపు కన్నెత్తి చూసే వారు కూడా లేకుండా పోయారు. దీనితో అదే సినిమా చెయ్యడానికి కేవలం 15 లక్షలకు ఒప్పుకుందట ఈ భామ.

ఆరు నెలలు తిరగకుండానే 85 లక్షల నష్టమన్నమాట. అది కూడా స్వయంకృతాపరాధమే. ఆమె మాతృభాష మ‌ల‌యాళంలోనూ ఇదే సీన్‌. నితిన్ సినిమాలోనైనా కొంత ప్రతిభ చూపించి పూర్వ వైభవం తెచ్చుకుంటుందేమో చూడాలి. నితిన్ కు ఈ సినిమా కాకుండా వెంకీ కుడుముల, వెంకీ అట్లూరిలతో కూడా సినిమాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందనేది చూడాలి. ఏది ఏమైనా నితిన్ ప్రియా ప్రకాష్ వారియ‌ర్ కు లైఫ్ లైన్ ఇచ్చాడనే చెప్పుకోవాలి.