Priya Benerjee Hot Photoshootప్రియా బెనర్జీ… టాలీవుడ్ లో అడవి శేష్ ‘కిస్’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయిన హీరోయిన్. ఆ తర్వాత కూడా ఒకటి, రెండు చిన్న సినిమాలలో చేసింది గానీ, కావాల్సిన బిగ్ బ్రేక్ మాత్రం లభించలేదు. దీంతో బాలీవుడ్ పయనమైన ఈ బ్యూటీ, అక్కడికి వెళ్ళేసరికి ‘బోల్డ్’గా మారిపోయింది. ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లలో హాట్ హాట్ సన్నివేశాలలో పాల్గొని కుర్రకారును తనవైపుకు తిప్పుకున్న ప్రియా, తాజాగా ఓ మ్యాగ్ జైన్ కోసం అందాలు ఆరబోసింది.

టూ పీస్ ఎల్లో డ్రెస్ లో ఎఫ్.హెచ్.ఏం.ఇండియా మ్యాగ్ జైన్ కు అదిరిపోయే ఫోటోషూట్ ను ఇచ్చింది. గడిచిన కొన్ని రోజులుగా ఒక్కో ఫోటోను రివీల్ చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ, తాజాగా మరో పిక్ ను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. తన లాంగ్ లెగ్స్ ను ప్రదర్శిస్తూ ఇచ్చిన స్టిల్ నెటిజన్ల మనసు దోచుకుంటోంది. టాలీవుడ్ లో ఉన్నపుడు ఇలాంటి హాట్ హాట్ కాస్ట్యూమ్స్ ను ధరించని ఈ ఎన్ఆర్ఐ బ్యూటీ, బాలీవుడ్ లో ఏ మాత్రం సంకోచం లేకుండా సొగసుల ప్రదర్శన ఇస్తోంది.