prince- six packమారుతీ ‘బస్ స్టాప్’ ద్వారా సక్సెస్ అందుకుని గుర్తింపు తెచ్చుకున్న హీరో ప్రిన్స్, ఆ తర్వాత వరుస వైఫల్యాలను చవిచూశాడు. గతేడాది ‘బిగ్ బాస్’ సీజన్ లో పాల్గొని కాస్త పాపులర్ అయిన ప్రిన్స్, ప్రస్తుతం రీ ఎంట్రీ సినిమా కోసం సన్నాహాలు చేసుకుంటున్నాడు. ‘సూపర్ స్టార్ కిడ్నాప్’ పేరుతో ఓ సినిమాను తీసిన సుశాంత్ రెడ్డి, తాజాగా ప్రిన్స్ తో ఓ మూవీకి శ్రీకారం చుట్టబోతున్నారు.

మేకోవర్ అయిన ప్రిన్స్ సిక్స్ ప్యాక్ లో కనిపించబోతున్నారని, అంతేగాక ఈ సినిమాలో అయిదుగురు హీరోయిన్లు ఉండడం మరో స్పెషల్ ఆకర్షణగా సుశాంత్ రెడ్డి తెలిపారు. ఆ అయిదుగురి హీరోయిన్లలో ఒకరు స్టార్ హీరోయిన్ అని, ఆ పేరు ప్రస్తుతానికి సస్పెన్స్ అంటూ తెలిపారు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతున్న ఈ సినిమా సుశాంత్ రెడ్డి స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.