Prince evicted from Jr NTR Bigg Boss Telugu showజూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తోన్న “బిగ్ బాస్”ను ఖచ్చితంగా గెలుస్తాడని ప్రేక్షకులు భావిస్తున్న వ్యక్తులలో హీరో ప్రిన్స్ ఒకరు. కానీ తాజాగా అదే ప్రిన్స్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసారు. దీంతో మరోసారి ‘బిగ్ బాస్’ షోపై విమర్శలు కురుస్తున్నాయి. ప్రేక్షకుల తీర్పే అంతిమం అంటున్న ‘బిగ్ బాస్’ షోలో ఈ వారం దాదాపుగా 2.82 కోట్ల మంది ఓటింగ్ లో పాల్గొన్నట్లుగా తెలిసింది. మరి అందులో ఎలిమినేట్ అయిన ప్రిన్స్ కు ఎన్ని ఓట్లు వచ్చాయి? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.

నిజానికి ఈ వారం ఎలిమినేషన్ జాబితాలో ఉన్న ఇతరుల వారి కంటే ప్రిన్స్ కు ఎక్కువ ఓట్లే పడాల్సి ఉంది. ఎందుకంటే మొదటి నుండి ప్రిన్స్ నెటిజన్ల సపోర్ట్ దక్కించుకున్నాడు. మరి ఏం జరిగిందో ఏమో గానీ ప్రిన్స్ ఎలిమినేట్ కావడం వీక్షకులకు షాకింగ్ లా మారింది. ఇదే అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా కూడా నెటిజన్లు వ్యక్తపరుస్తున్నారు. అయితే హౌస్ లోని సభ్యుల ఓటింగ్ ను కూడా తీసుకోవడం వలన, హరితేజ ఆడిన గేమ్ లో ప్రిన్స్ బలయ్యాడన్న వాదన కూడా బలంగా వినపడుతోంది. ఏది ఏమైనా ‘బిగ్ బాస్’ ఇచ్చిన ట్విస్ట్ కు ప్రేక్షకులకు దిమ్మ తిరిగింది.