Pressure on Rajamouli from all sidesఎస్ఎస్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ అక్టోబర్ 13 న విడుదల కాబోతుందని ఇప్పటికే ప్రకటించారు. ఇటీవల విడుదలైన తారక్ పుట్టినరోజు పోస్టర్‌లో మేకర్స్ కరోనా కారణంగా తమ సినిమా వాయిదా పడే అవకాశం లేదని చెప్పుకొచ్చారు. అయితే ఇంకా బ్యాలన్స్ ఉన్న 20% షూటింగ్‌తో పూర్తి చేయగలరా అనే సందేహాలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే, జూలైలో పరిశ్రమ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆర్ఆర్ఆర్ రిలీజ్ ప్లాన్ ను తిరిగి ధృవీకరించాలని రాజమౌళి పై ఒత్తిడి వస్తుందట. ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ని బట్టి మిగిలిన పెద్ద సినిమాలు వారి రిలీజ్లను ప్లాన్ చేసుకుంటాం అని వారు అంటున్నారట. అంతేకాకుండా, ఈ చిత్రం వివిధ భాషలలో విడుదల కానుంది.

అందుకని ఆర్ఆర్ఆర్ డిస్ట్రిబ్యూటర్లు రిలీజ్ డేట్ ని తెలుసుకోవాలనుకుంటున్నారు. తద్వారా వారు తమ ప్రమోషన్లు అలాగే ఇతర ఆర్థిక విషయాలను ప్లాన్ చేసుకోవచ్చు. అందుకోసం జూలైలో విడుదల తేదీని రాజమౌళి స్పష్టం చేస్తారని వార్తలు వస్తున్నాయి. 2022 సంక్రాంతికి గానీ, ఆ ఏడాది వేసవికి గానీ విడుదల అవ్వొచ్చని పుకార్లు ఉన్నాయి.

ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఇద్దరూ వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేసి, తమ ఇతర కమిట్మెంట్లు వైపు వెళ్ళడానికి ఆసక్తిగా ఉన్నారు. ఎన్టీఆర్ ఇప్పటికే కొరటాల శివ మరియు ప్రశాంత్ నీల్ తో సినిమాలు చెయ్యనున్నారు. రామ్ చరణ్ ఇప్పటికే శంకర్ తో సినిమా ఒకే చేశారు.