Pressure on KCR Cabinet Ministersతెలంగాణలో మంత్రి వర్గ విస్తరణకు సమయం ఆసన్నమయ్యింది. ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపుగా నెలన్నర కావొస్తున్నా కేసీఆర్ తో పాటుగా ఒకే ఒక్క మినిస్టర్ ఉన్నారు. దీనితో పాలన కుంటుపడింది. కాకపోతే కేసీఆర్ గురించి తెలిసి ఆయన ఘనవిజయాన్ని డైరెక్టుగా చుసిన మీడియా గానీ ప్రతిపక్షాలు గాని ఆయనను ప్రశ్నించే ధైర్యం లేదు. మరోవైపు మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకు జరగబోతుంది. అయితే మొదటి మంత్రివర్గ విస్తరణలో ఆయన 8 మందికి చోటు కల్పిస్తారని తెలుస్తోంది.

ఆతర్వాత మరో ఎనిమిది మందిని తీసుకుంటారని సమాచారం. ఈ మేరకు జాబితా కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. రెండో విస్తరణ పార్లమెంట్ ఎన్నికల తరువాత జరగనుంది. తక్కువ మంది మంత్రులతో పాలన సాగించడానికి తెలంగాణలో ప్రభుత్వ శాఖల పునర్‌ వ్యవస్థీకరణ చేసారు సీఎం కేసీఆర్. మొత్తం 34 శాఖలను 18గా మార్చారు. ఒకే రకమైన కార్యకలాపాలను నిర్వహించడంతో పాటు అనుబంధ విభాగాలుగా ఉన్న వాటిని ప్రధాన శాఖలో విభాగంగా మార్చారు.

అయితే ఈ క్రమంలో మంత్రులకు వర్క్ లోడ్ ఎక్కువ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అదే సమయంలో ఒకే మంత్రి కింద ఎక్కువ శాఖలు ఉంటే వారి పరపతి పెరిగే అవకాశం ఉంటుంది. దీనితో ఆశావహులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విస్తరణలో పెద్దగా ఆశ్చర్యకరమైన అంశాలు ఏమీ ఉండవని కేటీఆర్, హరీష్ రావులను మళ్ళీ కాబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉంటుందని, శాఖలలో కూడా మార్పు ఉండకపోవచ్చని కూడా సమాచారం. 18న కాబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉందని సమాచారం.