One India One Election, Narendra Modi One India One Election, Modi One India One Election, President Approves One India One Election, President Votes One India One Election, President Pranab Mukherjee Votes One India One Electionదేశంలో ఎప్పుడు చూసినా ఎక్కడో ఒక చోట ఎన్నికల తంతు జరుగుతూనే ఉంటోంది. దీంతో అభివృద్దికి ఎక్కడికక్కడ ఆటంకాలు ఎదురవుతున్నాయి. పార్లమెంటుకు ఓ సారి, ఆయా రాష్ట్రాల అసెంబ్లీలకు మరోసారి… ఇక ఎప్పటికప్పుడు ఉప ఎన్నికలు నిర్వహిస్తుండటంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతున్న వైనంపై గత కొంతకాలంగా తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రెండున్నరేళ్ల క్రితం ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ ఓ సరికొత్త ప్రతిపాదనను సిద్ధం చేశారు.

‘ఒక దేశం… ఒకే ఎన్నిక’ పేరిట చేసిన ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే… దేశంలో పార్లమెంటు, ఆయా రాష్ట్రాల అసెంబ్లీలకు ఏక కాలంలో ఎన్నికలు జరగనున్నాయి. ఫలితంగా ప్రజాధనం దుర్వినియోగానికి చెక్ పడటంతో పాటు ఐదేళ్ల పాటు అభివృద్ధికి ఆటంకాలు ఎదురుకాబోవు. ఈ ప్రతిపాదనకు ఇప్పటికే అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు సరేనన్నాయి. తాజాగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా ఈ ప్రతిపాదనకు ఓటేశారు. దీంతో ప్రధాని మోడీ ఆలోచన త్వరలోనూ కార్యరూపం దాల్చనుందని రాజకీయ వర్గాల్లో హల్చల్ చేస్తోన్న సమాచారం.