Premika Telugu Movie Teaser‘మన్మధుడు’ సినిమాలో క్యూట్ క్యూట్ గా కనిపించిన చిన్న పిల్లోడు తనీష్, హీరోగా నటించిన మొదటి సినిమా “నచ్చావులే” ద్వారా సూపర్ సక్సెస్ అందుకున్నాడు. యూత్ ఫుల్ హీరోగా అవతరిస్తాడని భావించిన తరుణంలో… తన బాడీపై శ్రద్ధ చూపించకపోవడంతో ప్రస్తుతం హీరో పర్సనాలిటీకి దూరమవుతున్నాడు. “నక్షత్రం” సినిమాతో విలన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న తనీష్, మరో వైపు “ప్రేమిక” అనే సినిమాలో లీడ్ రోల్ లోనూ నటిస్తున్నాడు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తొలి టీజర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. నిజజీవిత గాధతో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం గానీ, ఇందులో తనీష్ పర్సనాలిటీ మాత్రం ప్రధాన మైనస్ గా కనపడుతోంది. డైలాగ్స్ చెప్పిన తీరు పర్వలేదనిపించినా, సిల్వర్ స్క్రీన్ పై తనీష్ అవతారం చూడాలంటే ప్రేక్షకులు కాస్త ఇబ్బందిపడే విధంగా కనపడుతున్నారు. పర్సనాలిటీలు సరిగా మైంటైన్ చేయకపోతే సినీ వారసులుగా ఉన్న మంచు మనోజ్ తదితరులనే తిరస్కరించిన ఘనత తెలుగు ప్రేక్షకుల సొంతం.

ముందు దానిపై దృష్టి పెట్టిన తర్వాత సినిమాలపై ఫోకస్ పెడితే ఫలితాలు మరోలా ఉంటాయేమో గానీ, ఈ గెటప్ లో కష్టమే అని చెప్పక తప్పదు. ఇక కధ విషయానికి వస్తే… ఇద్దరు ప్రేమికులు… వారిద్దరిని విడదీయడానికి ఓ విలన్. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ అని చెప్పారు కాబట్టి… క్లైమాక్స్ ఖచ్చితంగా విషాదాంతంగా ఉంటుందని టీజర్ లోనే స్పష్టంగా చెప్పేసారు. ఇంకేముంటుంది… ఇదంతా ఎలా చిత్రీకరించారు? అనే దానిపైన చిత్ర విజయమా? పరాజయమా? ఆధారపడి ఉంటుంది.