Senior heroines Revathi And Suhasini take responsibility for remake kangana ranaut Queenబాలీవుడ్ లో కంగనాకు స్టార్ డంతో పాటు ఎన్నో అవార్డులు తెచ్చిపెట్టిన సినిమా “క్వీన్.” నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు హీరోయిన్లకు చాలా అరుదుగా లభిస్తుంటుంది. అలాంటి పాత్రే “క్వీన్” సినిమాలో కంగనా పోషించి విమర్శకుల ప్రశంసలు పొందింది. దీంతో ఈ సినిమాను దక్షిణాదిన రీమేక్ చేయడానికి అనేక మంది అగ్ర కధానాయకుల పేర్లు వచ్చి, మరుగున పడిన విషయం తెలిసిందే.

అయితే మళ్ళీ చాలాకాలం తర్వాత “క్వీన్” సినిమా రీమేక్ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ సారి తెరపైకి వచ్చిన మహారాణి “ప్రేమమ్” సినిమా హీరోయిన్ పార్వతి. సినీ విమర్శకుల ప్రశంసలతో పాటు యువతరం మనసు దోచుకున్న యువ కధానాయక పార్వతి ఈ ‘క్వీన్’ సినిమా రీమేక్ కు ఓకే చెప్పినట్లుగా మీడియాలో వర్గాల్లో కధనాలు ప్రసారమవుతున్నాయి.

‘క్వీన్’ సినిమా రీమేక్ లో కంగనా పాత్ర కోసం అందం, అభినయం కలగలిసిన పార్వతిని ఎంపిక చేయగా, ఒకప్పటి అందాల రాణి అయిన సుహాసిని తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను చేపట్టనున్నారని.., అలాగే, నటనలో రాణి అయిన రేవతి ఈ సినిమా కోసం ‘కలం’ కదపనున్నారని… తెలుస్తోంది. ఇలా ఈ ముగ్గురు మహారాణులు “క్వీన్” సౌత్ రీమేక్ కోసం ఒక్కటయ్యారన్న మాట.