Prashant Kishor's Double Standards Exposedఏపీలో పీకే టీమ్ సేవలందించిన వైసీపీ అఖండ విజయం సాధించడంతో… పశ్చిమ బెంగాల్‌లో మమత బెనర్జీ సారథ్యంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్ సైతం ప్రశాంత్ కిశోర్ టీమ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కూడా ప్రశాంత్ కిశోర్ టీమ్‌తో కలిసి పనిచెయ్యడానికి ఆసక్తిగా ఉన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ఇటీవల ఆళ్వార్‌పేటలో ఉన్న కమల్ హాస్సన్ పార్టీ కార్యాలయంలో రాజకీయ నిపుణుడు ప్రశాంత్‌ కిషోర్‌ తో సమావేశమైనట్టు సమాచారం.

రానున్న స్థానిక, అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రప్రజలను తమవైపు తిప్పుకునేందుకు పీకే టీం సేవలు కావాలనుకుంటున్నాడు కమల్. మొన్న ఆ మధ్య చంద్రబాబు కూడా వారిని సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి. అయితే తెలుగుదేశం పార్టీ దానిని ఖండించింది. మరోవైపు జగన్ ప్రశాంత్ కిషోర్ కాంట్రాక్టు పొడిగించడానికి ఆసక్తిగా ఉన్నారు. అసలు ఇన్ని రాజకీయ పార్టీలతో ప్రశాంత్ కిషోర్ ఒకేసారి ఎలా పని చేస్తాడో అనేది అందరిలోనూ ఉన్న అనుమానం.

అయితే ప్రశాంత్ కిషోర్ మాత్రం తాను పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వచ్చా అని, ఇప్పుడు తన ఐ-ప్యాక్ టీం తో తనకు సంబంధం లేదని, వారికి నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉందని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ 175 స్థానాలలో 151 స్థానాలు, 25 ఎంపీ సీట్లలో 22 సీట్లు గెలుచుకోవడంతో అందరి చూపూ ప్రశాంత్ కిషోర్ మీద ఉన్న మాట వాస్తవమే. అయితే ప్రశాంత్ కిషోర్ ఇప్పటివరకూ కేవలం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ సారథ్యంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్ తో మాత్రమే ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం.