Prashant Kishor team into andhra pradesh governmentఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోకి ప్రశాంత్ కిషోర్ బ్యాచ్ ఎంటర్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి. గత ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ అఖండ మెజారిటీ తో అధికారంలోకి తీసుకుని రావడంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏడాది పూర్తి కాగానే మళ్ళీ జగన్ కు ప్రశాంత్ కిషోర్ అవసరం పడిందని సమాచారం.

అధికారంలోకి రాగానే ప్రవేశపెట్టిన వాలంటీర్ల వ్యవస్థను పార్టీకి అనుకూలంగా మలచడం వారి పనట. జగన్ ప్రభుత్వం దాదాపుగా 85,000 కోట్ల విలువైన సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంది. ఇవి లబ్దిదారులకు అందించి, వారికి టచ్ లో ఉంటూ… తరచూ వారికి జగన్ ప్రభుత్వం వల్ల ఇంత మేలు జరుగుతుంది అని చెబుతూ వారిని వైఎస్సార్ కాంగ్రెస్ సమర్ధకులుగా మార్చాలి.

“ఆ పని ఎలా సమర్ధవంతంగా చెయ్యాలి అనేదాని పై ప్రశాంత్ కిషోర్ టైం అన్ని జిల్లాలలోని వాలంటీర్లకు ట్రైనింగ్ ఇస్తుంది. సహజంగా ఇటువంటి వాటికి పంచాయతీ రాజ్ శాఖ ట్రైనింగ్ ఇస్తుంది. అయితే పార్టీకి ఉపయోగపడే పని కాబట్టి అందుకు నమ్మకమైన ప్రశాంత్ కిషోర్ టీం ని వాడుకోవాలని ప్రభుత్వం యోచన,” అని తెలిసిన వారు అంటున్నారు.

దీనితో ఈ సారి ఎన్నికలకు నాలుగేళ్ల ముందే ప్రశాంత్ కిషోర్ టీం జగన్ కోసం పని చేస్తున్నట్టు అయ్యింది. గతంలో ప్రతిపక్షంలో ఉండగా పని చేసారు. ఇప్పుడు వారికి పూర్తి ప్రభుత్వ యంత్రాంగం యొక్క అండదండలు కూడా ఉండనున్నాయి. ఈసారి వారు ఎలాంటి ఫలితాలను రాబడతారో చూడాలి.