Prakasj Raj advice to Balakrishnaబాలయ్య తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలపై చేసిన కామెంట్లకు నాగబాబు గట్టిగానే రియాక్ట్ అయ్యారు. ‘భూముల పంపిణీ’ వ్యాఖ్యకు బాలయ్య బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ తరువాత నాగబాబు టీడీపీపై చేసిన కామెంట్లు పెద్ద దుమారమే లేపింది. సోషల్ మీడియాలో అయితే చిన్న సైజు యుద్ధమే జరుగుతుంది.

ఈ విషయంగా ఇండస్ట్రీ రెండు వర్గాలుగా చీలిపోయింది. కొందరు చిరంజీవి వర్గానికి, కొందరు బాలయ్యకు సపోర్టు చేస్తూ మాట్లాడారు. దీనితో ఇండస్ట్రీ పెద్దలు రంగంలోకి దిగి ఇరువర్గాలకు సర్దిచెప్పాల్సి వచ్చింది. ఈ విషయంగా ప్రకాష్ రాజ్ ను ఒక ఇంటర్వ్యూలో అడిగారు. దానికి ఆయన చెప్పిన సమాధానం ఈ విధంగా ఉంది.

“నాకు బాలయ్య బాబు, చిరంజీవి అన్నయ్య ఇద్దరు తెలుసు. చిరంజీవికి కొంతమందిని పిలిచి చర్చించడానికి ఆ పెద్దరికం ఉంది. బహుశా అతను తరువాత పిలుస్తాడు. మేము దానిని అలా చూడవలసి ఉంటుంది, అటువంటి ఈగోలు ఉండకూడదు. మీడియా కూడా ఇలాంటి వాటిని పెద్దది చేయకూడదు. నేను బాలయ్య బాబుకు చెప్పే వ్యక్తిని కాదు, కానీ మీరు నన్ను అడిగారు కాబట్టి చెబుతున్నాను. నాకు అలాంటి సమస్యలు ఉండవు ”అని ప్రకాష్ రాజ్ అన్నారు.

ఇది ఇలా ఉండగా… ఈ వివాదం ఇక సర్దుమణిగినట్టే అని ఇండస్ట్రీ పెద్దలు అంటున్నారు. బాలయ్య, చిరంజీవి ఇప్పటికే ఈ విషయంగా ఫోన్ లో మాట్లాడుకుని ఒక అండర్ స్టాండింగ్ కు వచ్చారని అంటున్నారు. మరోవైపు… షూటింగ్లు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈరోజో రేపో జీవో ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.