Mana Oori Ramayanam, Mana Oori Ramayanam Trailer, Mana Oori Ramayanam Trailer Talk, Prakash Raj Mana Oori Ramayanam Trailer Talk, Priyamani Mana Oori Ramayanam Trailer Talk, Prakash Raj Mana Oori Ramayanam Movie Trailer Talk‘ధోని, ఉలవచారు బిర్యానీ’ వంటి ఒక రకమైన సినిమాలకు దర్శకత్వం వహించి, తన అభిరుచి ఏమిటో చాటిచెప్పిన నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా “మన ఊరి రామాయణం.” తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా టీజర్ ను విడుదల చేసాడు ప్రకాష్.

ఒక ఊరిలో జరిగే సంఘటనల సమాహారంగా కనిపిస్తున్న ఈ టీజర్ లో ప్రకాష్ రాజ్ హావభావాలే హైలైట్స్ గా నిలుస్తున్నాయి. బ్యాక్ గ్రౌండ్ లో ఇళయరాజా అందించిన పాట, ఫోర్ గ్రౌండ్ లో ప్రకాష్ అభినయం ఒక వర్గం వారిని ఆకట్టుకునే సినిమాగా కనపడుతోంది. చివర్లో ప్రియమణి వేసిన ‘పెద్ద పార్టీయే’ డైలాగ్ బాగానే పేలింది.

ప్రకాష్ రాజ్ దర్శకత్వం వహించిన గత రెండు సినిమాలు ఒక దర్శకుడిగా పేరు తెచ్చినప్పటికీ, కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద ఏ మాత్రం ప్రభావితం చూపలేకపోయాయి. దీంతో ఈ ‘మన ఊరి రామాయణం’ అయినా కమర్షియల్ సక్సెస్ ని అందిస్తుందో లేదో చూడాలి. అయితే మునుపటి రెండు సినిమాలతో పోలిస్తే… కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాగా కనపడుతోంది.