Praja Vedika debris for auction వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే… అక్రమ నిర్మాణం అంటూ ఏకంగా ప్రజా వేదకను కూల్చివేసి… అక్రమ కట్టడాలు ఉన్న ఎవరినీ వదిలేది లేదని వార్నింగ్ ఇచ్చారు. అయితే ఆ తరువాత ప్రభుత్వం కరకట్ట మీద ఉన్న అక్రమ భవనాల జోలికి వెళ్లిన దాఖలాలు లేవు. ఇది ఇలా ఉండగా ప్రజా వేదిక కూలగొట్టి ఆ శకలాలు కూడా అక్కడ నుండి తరలించలేదు.

చంద్రబాబు ఇంటికి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు అది చూసి కుమిలిపోవాలని జగన్ ప్లాన్ అని చాలా మంది అభిప్రాయం. మొత్తానికి 9 నెలల క్రితం కూల్చివేసిన ప్రజావేదిక శకలాలను, ఇతర పరికరాలను వేలం వేసేందుకు ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి – సీఆర్డీఏ సిద్ధమైంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పుడు విడుదలయింది.

మార్చి 3వ తేదీ లోపు వేలం పత్రాలను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సీఆర్డీఏ సూచించింది. మార్చి 4వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ- వేలం ప్రారంభం అవుతుందని సీఆర్డీఏ స్పష్టం చేసింది. ఇది ఇలా ఉండగా… ప్రజావేదికను తమ పార్టీ సమావేశాలకు – తన క్యాంపు కార్యాలయం కోసం కేటాయించాలంటూ చంద్రబాబు ప్రభుత్వానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే.

కృష్ణా నది కరకట్టలో అక్రమ నిర్మాణాలలో బీజేపీ మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు గెస్ట్ హౌస్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన కుమారుడు, తమ్ముడు ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరారు. జగన్ కు గురువుగా చెప్పబడే శారదాపీఠానికి చెందిన స్వరూపానందేంద్ర స్వామికి కరకట్ట మీద ఒక ఆశ్రమం ఉంది. ఇవన్నీ అక్రమ భవనాలే.