Prabhudeva - Tamannaప్రస్తుతం ‘అభినేత్రి’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా… ఈ చిత్ర విశేషాలను పంచుకున్నారు. ‘మూడు భాషల్లో నిర్మితం అవుతున్న ఈ సినిమా కధ యూనివర్శల్ గా అందరినీ మెప్పిస్తుందని’ అభిప్రాయ పడ్డారు. హారర్ సినిమాలను చూడటం అంటే తనకు బాగా ఇష్టమని, ‘ఈవిల్ డెడ్’ చిత్రం ఇప్పటికి ఎన్నోసార్లు చూశానని, చూసిన ప్రతిసారి భయపడుతుంటానని చెప్పారు.

ఇక, డ్యాన్స్ ల విషయానికి వస్తే… గతంలో ఫలానా హీరో బాగా డ్యాన్స్ చేసేవాడని అనుకునేవారు, కానీ ప్రస్తుతం చాలా మంది హీరోలు బాగానే చేస్తున్నారని అన్నారు. హీరోయిన్లు కూడా డ్యాన్స్ లు బాగా చేస్తారని, పాత తరంలో రాధ, రాధిక, విజయశాంతి వంటి హీరోయిన్లు బాగా డ్యాన్స్ చేసేవారని, తనతో చేసిన హీరోయిన్లలో ‘వీళ్లు బెస్ట్, వాళ్లు బెస్ట్ అని ఒకరి పేరు నేను చెప్పకూడదు’ అంటూ నవ్వులు పూయించాడు.

ఇక, మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకు కొరియోగ్రాఫర్ గా అవకాశం వస్తే చేస్తారా? అన్న ప్రశ్నకు పిలిస్తే చేస్తాను… అంటూ సమాధానమిచ్చారు. దీంతో బాల్ మెగా కాంపౌండ్ లో వెళ్ళింది. గత ఏడెనిమిది సంవత్సరాలుగా అభిమానులను ఊరిస్తూ వస్తున్న ప్రతిష్టాత్మక సినిమాలో చిరంజీవి స్తేప్పులను ప్రభుదేవా కంపోజ్ చేస్తే ఫ్యాన్స్ కు అంతకు మించిన ఆనందం మరొకటి ఉంటుందా..! మరి మెగా వర్గం నుండి ‘పిలుపు’ వస్తేనే… ప్రభుదేవా ముందడుగు వేసేది..!