Prabhas20-Title-Out-But-Suspense-Continues-On-Himప్రభాస్ అభిమానుల చాలా నెలల నిరీక్షణ పూర్తి అయ్యింది. ఈరోజు ప్రభాస్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. “రాధేశ్యామ్” అనే టైటిల్ కూడా పెట్టారు. ప్రభాస్, సినిమాలోని హీరోయిన్ పూజా హెగ్డే ప్రేమగా కౌగిలించుకున్నట్టుగా ఉన్న ఫోజ్ తో సినిమా పోస్టర్ విడుదల చేశారు. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వెల్లడి కావడం గమనార్హం.

గతంలో వరుణ్ తేజ్ కంచె సినిమా, బెల్లంకొండ శ్రీనివాస్ సాక్ష్యం సినిమాలకు కూడా ఇదే రకమైన పోస్టర్లు విడుదల చేశారు. ఆ సారూప్యత గురించి కాకపోయినా దాదాపుగా రెండు సంవత్సరాలు వెయిట్ చేయించి ఇటువంటి సాదా సీదా పోస్టర్ ని విడుదల చెయ్యడం నిరాశపరిచింది అనే చెప్పుకోవాలి. ఇది ఇలా ఉండగా పోస్టర్ మీద మ్యూజిక్ డైరెక్టర్ పేరు లేకపోవడం గమనార్హం.

గతంలో కూడా సాహో సినిమాకు ఇలానే జరిగింది. ఆ సినిమాకు శంకర్-ఎహశాన్-లాయ్ ను మ్యూజిక్ డైరక్టర్స్ గా తీసుకున్నారు. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే టైమ్ కు వాళ్లు తప్పుకున్నారు. దీంతో మ్యూజిక్ డైరక్టర్ పేరు లేకుండానే అప్పుడు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇప్పుడు విషయంలో కూడా అదే రిపీటైంది. కాబట్టి ఇది బాడ్ సెంటిమెంట్ గా ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఈ సినిమా హిందీ హక్కులను టి. సిరీస్ తీసుకొంది. టి.సిరీస్ పాలసీ ప్రకారం ఒక సంగీత దర్శకుడికి రెండు పాటలుకి మించి ఇవ్వరు. అంటే ఒకే సినిమా ఆల్బంలో ఇద్దరు ముగ్గురు సంగీత దర్శకులు పాటలు ఇస్తారు. సాహో కు జరిగినట్టే ఈ సినిమాకు అదే జరిగే అవకాశం ఉందని అంటున్నారు. అది కూడా ఫ్యాన్స్ కు నచ్చడం లేదు.