Prabhas Wedding postponed to 2023యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఇండియన్ సినిమాలో ప్రస్తుతం అత్యంత అర్హత కలిగిన బ్యాచిలర్. అతని వివాహం చాలా కాలం నుండి మీడియాకు హాట్ టాపిక్. ప్రభాస్ పెదనాన్న, కృష్ణరాజు బాహుబలి రోజుల నుంచీ అతని వివాహం గురించి సంకేతాలు ఇస్తున్నారు, కానీ నటుడు ప్రస్తుతానికి దానిపై ఆసక్తి చూపడం లేదు.

అతని చేతిలో ఇప్పుడు మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. అతను 2021 లో రాధే శ్యామ్‌ను విడుదల చేయబోతున్నాడు మరియు మిగతా రెండు ప్రాజెక్టులను 2022లోనే విడుదల చేస్తాడు. నాగ్ అశ్విన్ పేరులేని చిత్రం మరియు ఆదిపురుష్ రెండూ ఆ ఏడాదే విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాలు అత్యంత భారీ సినిమాలు. దాదాపుగా 1,500 కోట్లతో నిర్మాణం జరుపుకుంటాయి.

అంటే అతను రాబోయే రెండేళ్లపాటు చాలా బిజీగా ఉంటాడు. దానితో వివాహానికి కూడా సమయం లేకపోవచ్చు. గతంలో ప్రభాస్‌కు పలువురు నటీమణులతో సంబంధం ఉందని వార్తలు వచ్చాయి. అదిగో పెళ్లి ఇదిగో పెళ్లి అంటూ వార్తలు వార్చి వడ్డించారు. అయితే ఏదీ జరగలేదు. దీనిబట్టి వివాహం గురించి తీవ్రంగా ఆలోచించట్లేదు అని అర్ధం అవుతుంది.

బహుశా బ్యాచిలర్ గానే ఉండటం నచ్చిందేమో. బహుశా తన పాన్-ఇండియా సూపర్ స్టార్ లక్ష్యాన్ని సాధించిన తర్వాత అతను వివాహం చేసుకునే అవకాశాన్ని పరిశీలిస్తాడు. బహుశా 2023 లో గానీ అది సాధ్యపడదు. అయితే అప్పటికి ప్రభాస్ 43 ఏళ్లు వస్తాయి. అయితే అతను ఎప్పుడు పెళ్లికి సిద్ధపడినా అమ్మాయిలు లైన్ లో నించుంటారు అనే దాంట్లో ఎటువంటి అనుమానం లేదు.