prabhas salaar movie updateయంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సలార్ మొదటి షెడ్యూల్ పూర్తి చేశారు. అతను రెండవ షెడ్యూల్ను ప్రారంభించాల్సి ఉండగా, కోవిడ్ సెకండ్ వేవ్ అన్ని ప్రణాళికలను దెబ్బతీసింది. ఈ చిత్రంలో ప్రభాస్ పాత్రపై అనేక ఊహాగానాలు వస్తున్నాయి. గత వారం, ప్రభాస్ తన కెరీర్‌లో మొదటిసారిగా డబల్ రోల్ లో కనిపించనున్నాడని ఒక వార్త మనం విన్నాము.

ఇప్పుడు, అతను ఈ చిత్రంలో ఆర్మీ ఆఫీసర్‌గా కనిపిస్తాడని ఇంకో వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతుంది. ఈ రెండు పుకార్లలో నిజం ఏమిటి అనేది నిర్దారించాల్సి ఉంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే ప్రభాస్ మిలటరీ వేషధారణ ధరించడం ఇది మొదటిసారి. ప్రభాస్ కు ఉన్న ఫిట్నెస్ కారణంగా అటువంటి వేషం చక్కగా సెట్ అవుతుంది.

ఈ మూవీ ఏప్రిల్ 23, 2022న వేసవి సెలవుల సందర్భంగా విడుదల కానుంది. సలార్ లో శృతి హాసన్ కథానాయికగా చేస్తుంది. ఈ నటి ప్రభాస్ ను రొమాన్స్ చేయడం ఇదే మొదటిసారి. ఈ చిత్రంతో ఆమె టాలీవుడ్‌లోని అందరి స్టార్స్‌ సరసన నటించినట్టు అయ్యింది. సలార్‌కు కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు.

ఈ చిత్రానికి ‘ది మోస్ట్ వైలెంట్ మెన్..కాల్డ్ వన్ మ్యాన్ .. మోస్ట్ వైలెంట్’ అనే శక్తివంతమైన క్యాప్షన్ పెట్టారు. ఈ చిత్రం నీల్ శైలిలో మాస్ మసాలా ఎంటర్టైనర్ కానుందని ఈ క్యాప్షన్ సూచిస్తుంది. ఈ సినిమా గతంలో ప్రశాంత్ కన్నడలో చేసిన ఉగ్రం అనే సినిమా రీమేక్ అని కూడా వార్తలు ఉన్నాయి. ఒకవేళ అదే నిజమైతే పైన చెప్పిన వార్తలు ఏవీ నిజం కావు.