Prabhas- Saaho -trailer in Salman khan Bharat intervalయంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం ఆగష్టు 15న స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఈ నెల ఐదవ తారీఖున విడుదల చేసే అవకాశం ఉంది. అప్పటికి రెడీ కాకపోతే 7వ తారీఖున విడుదల చేస్తారు. ఒకటి రెండు రోజులలో దీనికి సంబందించిన ప్రకటన విడుదల కావొచ్చు. సల్మాన్ ఖాన్ భరత్ సినిమా భారీ ఎత్తున విడుదల కావడంతో ఆ థియేటర్లలో ఇంటర్వెల్ లో ఈ సినిమా టీజర్ ప్లే చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా ఈ టీజర్ లో వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం ఓ హాలీవుడ్ మ్యూజిక్ బిట్ ను కొనుగోలు చేసారని తెలుస్తోంది. దాని కోసం ఆ కంపెనీకి ఏకంగా 15 లక్షలు రాయల్టీ చెల్లించినట్లు తెలుస్తోంది. ఇది చాలా భారీ మొత్తం అనే చెప్పుకోవాలి. సినిమా పవర్ ఏమిటనేది ఈ టీజర్ ద్వారా తెలిసే అవకాశం ఉంది. అందుకే టీజర్ పై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ శ్రద్దా కపూర్ ఈ సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అరంగేట్రం చేస్తుంది.

ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మ్యూజిక్ డైరెక్టర్లు శంకర్ ఎహసాన్ లాయ్ తప్పుకోవడం పై రకరకాల రూమర్లు మీడియాలో వైరల్ అయ్యాయి. వారికి రీప్లేస్మెంట్ గా అనేక పేర్లు విపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకూ చిత్ర నిర్మాతలు ఎవరినీ ధృవీకరించలేదు. ఈ చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ మూవీ చివరి షెడ్యూల్ ముంబాయిలో జరుగుతోంది. తొందరలోనే సినిమా చిత్రీకరణ పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టేస్తారు.