‘బాహుబలి 2’ తర్వాత ప్రభాస్ పై వచ్చిన హైప్ ను సుజిత్ దర్శకత్వం వహిస్తోన్న “సాహో” మ్యాచ్ చేయగలదా? లేదా? అన్న అనుమానం సర్వత్రా నెలకొంది. కానీ నేడు రిలీజ్ చేసిన ‘షేడ్స్ ఆఫ్ సాహో’ రిలీజ్ తర్వాత అలాంటి సందేహాలకు నివృత్తి లభించినట్లే భావించవచ్చు. టాలీవుడ్ తెరపై కెన్ని బేట్స్ చిత్రీకరించిన సూపర్ యాక్షన్ సన్నివేశాలను “సాహో”ద్వారా చూపించబోతున్నారని ఈ వీడియో స్పష్టం చేసింది.

ముఖ్యంగా యంగ్ రెబల్ స్టార్ కటౌట్ ను చూపించిన విధానం ఫ్యాన్స్ కు ఐ ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు. దీంతో “సాహో” అంచనాలు ఒక్కసారిగా పెరిగాయని చెప్పడంలో సందేహం లేదు. తమ అభిమాన హీరోను చూడాలని ఇన్నాళ్ళు వేచిచూసినందుకు ప్రభాస్ ఫ్యాన్స్ ప్రస్తుతం పండగ చేసుకుంటున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషలలో ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేయడానికి రంగం సిద్ధమవుతోంది