Prabhas Saaho Release date ‘బాహుబలి’ రెండు పార్టుల తర్వాత ఇండియన్ హీరోగా ప్రభాస్ అవతరించిన విషయం తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ కు వచ్చిన క్రేజ్ రీత్యా… ప్రస్తుతం సెట్స్ పై ఉన్న “సాహో”పై యావత్తు ఇండియన్ చిత్రసీమ ఎదురుచూస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా? అని కళ్ళు కాయలు కాచేలా అభిమానులు నిరీక్షిస్తున్నారు.

తొలుత 2019 సమ్మర్ విడుదల అని భావించినప్పటికీ, తాజాగా జరుగుతున్న షూటింగ్ అప్ డేట్స్ ప్రకారం… ఆగష్టు 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అన్ని భాషలలో “సాహో”కు ఇతర పెద్ద సినిమాల నుండి ఎలాంటి అడ్డంకి లేకుండా ఉండాలంటే, ఈ డేట్ అయితేనే సరైనదిగా చిత్ర నిర్మాణ సంస్థ భావిస్తున్నట్లుగా సమాచారం.

అయితే ఈ తేదిని అఫీషియల్ గా చిత్ర నిర్మాణ సంస్థ ఎప్పుడు ప్రకటిస్తుందా? అనేది వేచిచూడాల్సిన అంశం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సన్నిహితులు యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాకు ‘రన్ రాజా రన్’ ఫేం సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టీజర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.