prabhas -saaho movie disasterయంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సాహూ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెల్లవారక ముందే స్పెషల్ షో వెయ్యడంతో కోడి కుయ్యకముందే నెగటివ్ టాక్ వచ్చేసింది. చరిత్రలో మొట్టమొదటి సారి ఒక్క దక్షిణాది నటుడికి పాన్-ఇండియా సూపర్ స్టార్ అయ్యే అవకాశం దక్కింది. రజినీకాంత్ కు కూడా ఉత్తరాది వారిని మెప్పించడం అవ్వలేదు. అయితే అది నెరవేరలేదు అనే చెప్పాలి. దీనికి బాధ్యులు ఎవరు అంటే ఎక్కువగా వేళ్ళు చూపించేది దర్శకుడు సుజీత్ వైపే.

ఈ సినిమాకు ముందు సుజీత్ చేసింది ఒక్క సినిమానే. అది కూడా శర్వానంద్. బాహుబలి 2 లాంటి బ్లాక్ బస్టర్ తరువాత అతనికి అవకాశం ఇవ్వడం సాహసమే. సినిమాలో అతని అనుభవారాహిత్యం అణువణువునా కనిపించింది. కుర్రోడిలో టాలెంట్ ఉన్నా ఈ రేంజ్ ప్రాజెక్టు, 350 కోట్ల బడ్జెట్, పాన్-ఇండియా ఆడియన్స్ వ్యూ ఇవన్నీ కుదరడం అంత చిన్న విషయం కాదు. అదే దెబ్బ కొట్టింది, దానికి ప్రభాస్ తో పాటు అతనూ, అతనితో పాటు తెలుగు ఇండస్ట్రీ కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

బాహుబలి 2 తరువాత కొంచెం చిన్న స్పాన్ ఉన్న సినిమాను ఎంచుకుంటే ప్రేక్షకులను ఆకట్టుకునే పని తేలిక అయ్యేది. ఇంత భారీ ప్రాజెక్టు తీసుకోవడం, దానికి ఎక్స్పీరియన్స్ లేని దర్శకుడిని పెట్టుకోవడం రెండూ ప్రభాస్ చేసిన తప్పులే… అయితే కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలని అనుకున్నాడు ప్రభాస్.. పని అవ్వలేదు. ఇది ఇలా ఉండగా తన నెక్స్ట్ సినిమా కూడా రాధాకృష్ణ అనే రెండో సినిమా దర్శకుడికే చేస్తున్నాడు ప్రభాస్. అతని మొదటి సినిమా జిల్ బాక్స్ ఆఫీసు వద్ద ఫెయిల్ అయ్యింది. ఆ సినిమా షూటింగ్ ఇప్పటికే 40% పూర్తి అయ్యింది. ఈ క్రమంలో ప్రభాస్ అభిమానులకు కంటి మీద కునుకులేకుండా చేశాడు.