prabhas saaho hard to get 290 crores shareయంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహూ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. తొలి ఆట నుండే నెగటివ్ టాక్ తెచ్చుకుని అభిమానులను నిరాశపరచింది. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే ఆడుతుంది. మొదటి వారాంతంలో చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలలో కలిపి దాదాపుగా 153 కోట్ల షేర్ రాబట్టింది. దీనితో టాప్ 3 అల్ టైమ్ తెలుగు హిట్స్ లో ప్రభాస్ మూడవ చిత్రం వెళ్లినట్టు అయ్యింది. మూడు రోజులలోనే మూడో స్థానం దక్కించుకోవడం గమనార్హం.

అలాగే దక్షిణాదిన సినిమా ఆరవ అతిపెద్ద హిట్. తొలి ఆరు స్థానాలలో ప్రభాస్ సినిమాలు మూడు, రజినీకాంత్ వి మూడు ఉండటం గమనార్హం. ఈరోజు వినాయక చవితి సెలవు కావడంతో ఈరోజు కూడా సినిమా వసూళ్ళు బావుంటాయని అంచనా. అయితే అంచనాలకు మించి ఆడుతున్నా సినిమా చెయ్యాల్సింది ఇంకా చాలా ఉంది. బ్రేక్ ఈవెన్ అనిపించుకోవాలంటే సాహూ ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలలో కలిపి 290 కోట్ల షేర్ రాబట్టాలి. అయితే సినిమా టాక్ కంటే బెటర్ గా పెర్ఫర్మ్ చేస్తున్నా అది కష్టమనే చెప్పుకోవాలి.

మొదటి వారాంతంలో కేవలం 153 కోట్లు రాబట్టడం అంటే టార్గెట్ ఇప్పటివరకూ కేవలం 52.7% మాత్రమే కంప్లీట్ అయినట్టు. పనిదినాలు మొదలు కావడంతో మంగళవారం నుండి సినిమాకు అసలు పరీక్ష మొదలు కాబోతుంది. ప్లాప్ టాక్ తో కూడా వస్తున్న కలెక్షన్స్ చూసి అసలు సాహూ కు మంచి టాక్ వస్తే ఎలా ఉండేదో తలచుకుని అభిమానులు నిట్టూరుస్తున్నారు. ఏది ఏమైనా సాహూ తన రన్ పూర్తి చేసుకునేటప్పటికీ ఎక్కడకు చేరుకుంటుందో చూడాలి.