Prabhas Saaho First Look Photo Shootఅక్టోబర్‌ 23న ప్రభాస్‌ బర్త్‌డే. ఇంకో వారం టైముంది! కానీ, ప్రభాస్‌ శనివారం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో ‘సాహో’ కోసం స్పెషల్‌ సెట్‌లో బర్త్‌డే కోసం స్పెషల్‌ ఫొటోషూట్‌ చేశారు. ఇదే సాహోలో ప్రభాస్‌ ఫస్ట్‌ లుక్‌ షూట్‌ అట. ప్రభాస్‌ బర్త్‌డే సందర్భంగా ‘సాహో’లో ఆయన ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

‘రన్‌ రాజా రన్‌’ ఫేమ్‌ సుజీత్‌ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌ ‘సాహో’ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. బాలివుడ్ భామా శ్రద్ధా కపూర్ ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నటిస్తుంది. దక్షిణాదిన ఆమెకు ఇదే తొలి చిత్రం. 150 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తెలుగులో రాబోతున్నఅత్యంత ఖరీదైన సినిమాల్లో ఇదొకటి. అధిక భాగం షూటింగ్ దుబాయ్లో జరగనుంది. తొందర్లోనే సినిమా యూనిట్ సరికొత్త షెడ్యూల్ కోసం యూరప్ వెళ్లనుంది. ఈ సినిమా వచ్చే సంవత్సరం ప్రేక్షకుల ముందుకి రానుంది. మూడు భాషల్లో ఒకేసారి విడుదల అవుతుంది.