Prabhas Saaho fan made squad‘బాహుబలి 2’ వంటి చారిత్రాత్మకమైన సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించే సినిమాపై ఎంత ఫోకస్ ఉందో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించే సినిమా పైన కూడా అదే స్థాయిలో ట్రేడ్ వర్గాలలో ఫోకస్ ఉంది. ‘బాహుబలి 2’తో పాటు ఈ సినిమా ప్రీ టీజర్ ను విడుదల చేయడం ద్వారా ప్రభాస్ తదుపరి సినిమా “సాహో” అన్న విషయాన్ని ప్రేక్షకులకు చేరువ చేయడంలో చిత్ర యూనిట్ సక్సెస్ సాధించింది.

అయితే ఈ టీజర్ లో అంతా బాగానే ఉన్నా, చివర్లో గాలిలో ఎగిరిపోతూ వచ్చే ఓ రెండు షాట్స్ మాత్రం ఏం అర్ధం కాకుండా చేసాయి. అప్పటివరకు ఓ కమర్షియల్ ఎంటర్టైనర్ అనుకున్న టీజర్ కాస్త, కన్ ఫ్యూజన్ కు గురి చేసేలా మారింది. అయితే దీనిపై చిత్ర యూనిట్ కూడా వివరించే దశలో లేదు. ప్రస్తుతం అంతా ‘బాహుబలి 2’ మేనియా నడుస్తుండడంతో ‘సాహో’ అన్నది సెకండరీగా మారిపోయింది.

ఆ టీజర్ లోని ఫ్లైయింగ్ స్క్వాడ్ తరహాలో వెళ్ళిపోయిన మనుషులను ఊహించికుని, ఓ యంగ్ రెబల్ స్టార్ అభిమాని ప్రభాస్ ను కూడా అదే స్టిల్ లో తయారుచేసి చిత్ర యూనిట్ కు పంపించాడు. అయితే ఈ స్టిల్ ను చిత్ర యూనిట్ కూడా మెచ్చి రీ ట్వీట్ చేయడం విశేషం. అంటే ఈ సినిమాలో ప్రభాస్ ఇలా ఫ్లైయింగ్ స్క్వాడ్ గా ‘సూపర్ మ్యాన్’ తరహాలో కనిపించనున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చూడడానికి పోస్టర్ లో ఓకేగా ఉన్నా, సిల్వర్ స్క్రీన్ పైన ఎలా ఉంటుందో తెలియాలంటే వచ్చే ఏడాది వరకు వెయిట్ చేయాల్సిందే.