prabhas saaho - allu arjun naa peru suryaనెమ్మది నెమ్మదిగా హిందీ ప్రేక్షకులలో తెలుగు సినిమాలు తమదైన ముద్ర వేస్తున్నట్టుగా అనిపిస్తుంది. బాహుబలి 2 తో హిందీ ప్రేక్షకులు తెలుగు సినిమాల వైపు ఆసక్తిగా చూస్తున్నారు. దీనితో అక్కడ మన సినిమాలకు డిమాండ్ పెరిగింది. గత వారం హిందీ ఛానెల్స్ లో టాప్ ఫోర్ సినిమాల రేటింగ్స్ చూస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది.

మొదటి నాలుగు స్థానాలలో నాలుగూ తెలుగు సినిమాలే ఉండటం గమనార్హం. అఖిల్ అక్కినేని మిస్టర్ మజ్ను, ప్రభాస్ సాహు, విజయ్ దేవరకొండ గీత గోవిందం, సూర్య ది సోల్జర్ (అల్లు అర్జున్ నా పేరు సూర్య) సినిమాలు హిందీ ప్రేక్షకుల ఆదరణ పొంది మొదటి నాలుగు స్థానాలలో నిలిచాయి.

ఈ సినిమాలు ఇప్పటికే రెండు మూడు సార్లు టీవీలో ప్రసారం అయ్యాయి. సాహో అయితే ఇది నాలుగో సారి టీవీలో టెలికాస్ట్ కావడం. అయినా వాటికి క్రేజ్ తగ్గకపోవడం గమనార్హం. ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాలకు హిందీలో బాగా డిమాండ్ ఉంది. ఇప్పుడు అది మరింత పెరిగింది.

ఈ ట్రెండ్ కారణంగా తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్ రైట్స్, హిందీ శాటిలైట్ రైట్స్ కు రేట్లు బాగా పెరుగుతాయని, కరోనా కాలంలో ఇది తమకు ఎంతో కలిసి వస్తుందని తెలుగు నిర్మాతలు భావిస్తున్నారు. అదే జరిగితే తెలుగుసినిమాకు ఈ గడ్డు కాలంలో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది.