Prabhas Radhe Shyam Lyrical Videoయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సంక్రాంతికి రిలీజ్ కి రెడీ అవుతోన్న “రాధే శ్యామ్” పబ్లిసిటీ విషయంలో చిత్ర నిర్మాణ సంస్థపై అభిమానులు గుర్రుగా ఉన్నారు. అయితే ఎట్టకేలకు ‘రాధే శ్యామ్’ ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభం కావడంతో పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలు ఇప్పటికే రెండు, మూడు పాటలను విడుదల చేసి సందడి చేస్తుండగా, “రాధే శ్యామ్” తన మొదటి లిరికల్ వీడియోను ఈ నెల 15వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన చేసారు. నీళ్ళల్లో మునిగిన కారులో ప్రభాస్ – పూజా హెగ్డే ఉన్న పోస్టర్ కూల్ లుక్ తో ఉంది.

జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించిన ‘ఈ రాతలే…’ అన్న పాటకు కృష్ణ కాంత్ సాహిత్యం సమకూర్చారు. ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా మరియు హరిణిలు ఈ పాటకు తమ గాత్రాన్ని అందించారు. ఎట్టకేలకు విడుదల కాబోతున్న ‘రాధే శ్యామ్’ ఫస్ట్ సింగిల్ పై ఇండస్ట్రీ వర్గాలలోనూ భారీ అంచనాలే ఉన్నాయి.